సూర్యాపేట జిల్లాలో టీయూడబ్ల్యూజే-ఐజేయూ జోరుగా సభ్యత్వ నమోదు

May 13, 2026 - 15:48
May 13, 2026 - 16:07
 0  15

టి యు డబ్ల్యూ జే (ఐజేయు) జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ కృష్ణ బంటు

సూర్యాపేట 13 మే 2026 తెలంగాణ వార్త రిపోర్టర్:- సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ యూనియన్ - ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ (TUWJ-IJU) సభ్యత్వ నమోదు కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతోందని టీయూడబ్ల్యూజే (ఐజేయు) సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ కృష్ణ బంటు అన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 23 మండలాల్లో గత వారం రోజులుగా జర్నలిస్టులను భాగస్వాములను చేస్తూ యూనియన్ నాయకులు విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారనీ, ఇందులో భాగంగా  బుధవారం అరవపల్లి, నాగారం మండల కేంద్రాలు, తిరుమలగిరి మున్సిపాలిటీ కేంద్రంలో పలువురు జర్నలిస్టులకు సభ్యత్వాలు అందజేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. యూనియన్  రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు, ఐజేయు జాతీయ కార్యవర్గ సభ్యులు కొణిజేటి సత్యనారాయణ మార్గదర్శకత్వంలో, యూనియన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చలసాని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో  జిల్లా నాయకులు షేక్ రషీద్ ఖాన్, పులుసు నాగరాజు గౌడ్ సభ్యత్వ నమోదు కోసం జిల్లా వ్యాప్తంగా పర్యటించడం జరుగుతుందన్నారు. గత 10 ఏళ్లుగా ప్రతిపక్ష పాత్ర పోషించిన యూనియన్ ప్రస్తుతం అధికారిక గుర్తింపుతో జర్నలిస్టుల సమస్యలపై  యూనియన్ నిరంతరం పోరాడుతూ వారి సంక్షేమం, అభివృద్ధి కోసం కృషి చేస్తుందని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో మెజారిటీ అక్రిడిటేషన్ కమిటీ సభ్యులు మన యూనియన్‌కు చెందినవారే ఉన్నారని వెల్లడించారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, వీడియోగ్రాఫర్లు, ఫోటోగ్రాఫర్లతో సహా అన్ని విభాగాలలో అర్హులైన జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు అందేలా చూడటం తమ లక్ష్యమన్నారు. అదేవిధంగా జిల్లాలో ఇళ్ల స్థలాలు రాని జర్నలిస్టుల వివరాలతో మండలాల వారీగా జాబితా సిద్ధం చేసి మంత్రులు, జిల్లా అధికారులకు అందజేసి సమస్య పరిష్కారానికి యూనియన్ సత్వర చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఈ నెల 17వ తేదీ వరకు సభ్యత్వ నమోదుకు గడువు ఉందని, ఇంకా సభ్యత్వం తీసుకోని జర్నలిస్టులు వెంటనే నమోదు చేసుకోవాలని యూనియన్ నాయకులు పిలుపునిచ్చారు.  ఈ కార్యక్రమంలో బైరబోయిన వెంకటేశ్వర్లు, వడ్లకొండ గంగాధర్, చింతలపాటి సుధాకర్, కే వెంకన్న, రహీం, రాములు నాయక్, చాంద్ పాషా, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333