సుబేదార్ మాన్ కిషన్ కు జాతియా ఐక్యత అవార్డు ప్రదానం...!
సుబేదార్ మాన్ కిషన్ కు జాతియా ఐక్యత అవార్డు ప్రదానం...!
అందోల్ నియోజకవర్గం తెలంగాణవార్త ప్రతినిధి :- ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఉద్యోగి, ప్రస్తుత జాతీయ డిఫెన్స్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు.మెదక్ జిల్లా మండల కేంద్రమైన టేక్మాల్ కు చెందిన సుబేదార్ మణికిషన్ 2025 సంవత్సరం"జాతీయ ఐక్యత అవార్డుకు ఎంపిక ఐనా విషయం తెలిసిందే. తెలంగాణా సిటిజన్స్ కౌన్సిల్ (టి.టి.సి.)ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరము వివిధ సేవారంగాలలో విశిష్ట చేసిన వారికి సమాజ సేవలు అందిస్తున్న ప్రముఖులను గుర్తించి ఎంపిక చేసిఇచ్చే జాతీయ ఐక్యత అవార్డు ని ఈ సంవత్సరము తెలంగాణా సిటిజెన్ కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ రాజ్ నారాయణ ముదిరాజు గారు ప్రకడించడం జరిగింది. సుబేదారు మాన్ కిషన్ గారు గత ఇరవై సంవత్సరాల క్రితం మండల కేంద్రమైన టేక్మాల్ లోని మంజీరా యువజన సంఘము, ద్వారా వివిధ సేవాకార్యక్రమలు. మరియు టేక్మాల్ మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులుగా టేక్మాల్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడుగా పని చెప్పారు. ఆర్డినేన్స్ ఫ్యాక్టరీలో మెదక్ లో కార్మిక నాయకునిగా చేపట్టిన వివిధ సేవాకార్యక్రమలను పరిగణలోకి తీసుకొని, అవార్డుకి ఎంపిచేసినట్టు నిర్వహకులు తెలిపారు. ఈ మేరకు తెలంగాణా సిటిజెన్ కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ రాజ్ నారాయణ ముదిరాజ్ గారు.ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ అవార్డుని శ్రీ స్వామి వివేకానంద 192 వ జన్మదిన ముగింపు ఉత్సవాల పురస్కారించుకొని గురువారం నాడు హైదరాబాద్ నాంపల్లి లోని పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్శిటి ఆడిటో రీయంలో అవార్డును సుబేదార్ మాన్ కిషన్ గారికి ప్రధానం చేశారు.ఈ కార్యక్రమనికి ముఖ్య అతిథులుగా ప్రొఫెసర్ కుమార్ మోలుగారం (ఉస్మానియా యూనివర్సిటి వైస్-ఛాన్సులర్) హైకోర్ట్ మాజీ న్యాయమూర్తి జస్టిస్ పి.ఎస్. నారాయణ, తెలంగాణ రాష్ట్ర సాహిత్య అకాడమీ భాష మరియు సాంస్కృతిక శాఖ కార్యదర్శి డాక్టర్ ఎస్.బాలస్వామి గారు. మరియు తెలంగాణా సిటిజెన్ కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ రాజ్ నారాయణ ముదిరాజ్ గార్ల చేతులమీదుగా అవార్డు ప్రదానం చేశారు. మాన్ కిషన్ గారికి అవార్డు ప్రదానం చేయడం పట్ల హర్షం వ్యక్తంచేశారు. ఈ అవార్డుకు ఎంపికైనందుకు తనపై మరింత భారం పెరిగిందని సుబేదార్ మాన్ కిషన్ అన్నారు. ఈ అవార్డు ఎంపిక సహకరించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.