సీసీ కెమెరాలు సద్వినియోగం చేసుకోవాలి SI శ్రీకాంత్ గౌడ్.

తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్ సీసీ కెమెరాలు సద్వినియోగం చేసుకోవాలి శ్రీకాంత్ గౌడ్. ఆత్మకూర్ సీసీ కెమెరాలు మూడు నేత్రంగం పనిచేస్తాయని పాఠశాలలో సీసీ కెమెరాలను సద్వినియోగం చేసుకోవాలని ఎస్సై బి శ్రీకాంత్ గౌడ్ అన్నారు. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2002-03 సంవత్సరం టెన్త్ చదివిన విద్యార్థుల పాఠశాలకు 50 వేల విలువగల నాలుగు సీసీ కెమెరాలు ఇవ్వగా ఎస్సై శ్రీకాంత్ గౌడ్ వాటిని ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పాఠశాలలు దేవాలయాలతో సమానమని ఇటీవల కొందరు అసాంఘిక కార్యక్రమాలకు పాఠశాలలను వాడుతున్నారని ఇది మంచి పద్ధతి కాదని అన్నారు సీసీ కెమెరాలతో ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించవచ్చునని పాఠశాలలో ఏ కార్యక్రమాలు జరిగినా వెంటనే తెలిసిపోతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రావణ్ కుమార్ పూర్వ విద్యార్థులు చిత్తలూరు వెంకన్న దాసరి మల్సూర్, చల్లా శ్రీనివాసరెడ్డి గునిగంటి అంజయ్య, యాతాకుల పరమేష్, బట్టిపల్లి వెంకన్న, కిరణ్ పంచాయతీ కార్యదర్శి సుధాకర్ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు