సీడ్స్ ను పరిశీలిస్తున్న టాస్కో ఫోర్స్ అధికారి సూరజ్ కుమార్, ఏవో పాండురంగచారి

Jun 15, 2026 - 19:54
 0  5
సీడ్స్ ను పరిశీలిస్తున్న టాస్కో ఫోర్స్ అధికారి సూరజ్ కుమార్, ఏవో పాండురంగచారి

అడ్డగూడూరు 15 జూన్ 2026 తెలంగాణవార్త రిపోర్టర్:– యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలలోని పలు విత్తన డీలర్స్ దుకాణాలను తనిఖీ చేసిన సీడ్ టాస్క్ ఫోర్స్ అధికారి సూరజ్ కుమార్ డీలర్ల వద్ద గల పత్తి మరియు వరి విత్తనాలకి సంబందించిన స్టాక్ రిజిస్టర్ బిల్ బుక్స్ ను మరియు  నిల్వ స్టాకుని తనిఖీ చేసారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..రైతులకి నాణ్యమైన విత్తనాలు అందించాలని డీలర్స్ కి అదేశించారు.రైతులు లైసెన్సు కలిగి ఉన్న డీలర్స్ వద్ద మాత్రమే విత్తనాలు కొనుగోలు చేయాలన్నారు.విత్తనాలు కొన్న రశీదు తప్పనిసరిగా తీసుకోవాలని దానిని పంట కాలం పూర్తి అయ్యేంత వరకు భద్రపరచుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో స్థానిక వ్యవసాయ అధికారి పాండురంగాచారి,పోలీస్ కానిస్టేబుల్ రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333