సీజనల్ వ్యాధుల నివారణకు చర్యలు తీసుకోవాలి.
జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్.
జోగులాంబ గద్వాల 8 జూలై 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- సీజనల్ వ్యాధు లు వ్యాప్తి చెందకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ అన్నారు. బుధవారము ఐ డి ఓ సి సమావేశ మందిరంలో సీజనల్ వ్యాధులపై అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఆదేశించారు. సీజన్ వ్యాధుల నివారణకు ప్రతి మండల స్థాయిలో సమన్వయ సమావేశాలు నిర్వహించి అన్ని శాఖల అధికారులతో సమిష్టిగా కలిసి పని చేయాలని కోరారు. ప్రతి మంగళ శుక్రవారం తప్పనిసరిగా డ్రై డే కార్యక్రమాలు నిర్వహించాల నీ కోరారు. పరిశుద్ధ పనులు రిజిస్టర్లో నమోదు చేయాలని సూచించారు. సీజనల్ వ్యాధులు. మలేరియా డెంగ్యూ చికెన్ గున్యా టైఫాయిడ్ వంటి వ్యాధులు ప్రబలకుండా అన్ని రకాల చర్యలు చేపట్టాలని అన్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రతి గ్రామంలోనూ మున్సిపల్ వార్డులలో ఇప్పుడు నీరు నిల్వ లేకుండా ఎప్పటికప్పుడు పరిశుద్ధ పనులు చేపట్టాలని తెలిపారు. టీవీ కేసులు ముందస్తు గుర్తించి సకాలంలో చికిత్సలు అందించాలన్నారు జెసిబి అయినా రక్తపోటు మధుమేహం వ్యాధులపై ప్రత్యేక దృష్టి సారించి వారికి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించి అవసరమైన వైద్య సేవలు అందించాలని తెలిపారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం కోసం నులి పురుగులు నివారణ కోసం అల్పడో జోనల్ మందులు వేయాలని అన్నారు. ప్రభుత్వ ప్రైవేటు అంగన్వాడీలు పిల్లలందరికీ మాత్రాలు వేయించి అనారోగ్యాల నుంచి రక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నర్సింగరావు. జిల్లా అధికారులు ఎంపీడీవోలు మున్సిపల్ కమిషనర్లు. సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.