సీజనల్ వ్యాధులపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలి.
జోగులాంబ గద్వాల 28 సెప్టెంబర్ 2024 తెలంగాణవార్త ప్రతినిధి:- గద్వాల సీజనల్ వ్యాధులైన టైఫాయిడ్ మలేరియా డెంగ్యూ లాంటి వ్యాధులపై ప్రజలు అవగాహన కలిగి తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు ప్రజలకు తమ పాటల ద్వారా డప్పు కొడుతూ అవగాహన కల్పించారు. గద్వాల్ మండలంలోనీ మదనపల్లి గ్రామంలో శనివారం జిల్లా కలెక్టర్ బి ఎం సంతోష్ కుమార్ ఆదేశాల మేరకు డి పి ఆర్ ఓ అరీఫుద్దీన్ సారథ్యంలో తెలంగాణ సాంస్కృతిక సారథి ప్రభుత్వ కళాకారులు పరిసరాల పరిశుభ్రత పై సీజనాలు వ్యాధులకు రాకుండా జాగ్రత్తలు పాటించాలని అవగాహనా కల్పించారు . ఈ కార్యక్రమం లో గ్రామ పంచాయతీ సెక్రెటరీ, గ్రామ పెద్దలు పాల్గొని తిలకించారు. ఈ కార్యక్రమంలో కళాకారులు కేశవులు హాజరత్ భూపతి రాహుల్ రమాదేవి కృష్ణ స్వామి పాల్గొన్నారు.