సామాజిక మాధ్యమాలలో ఆధారాలు లేని వాటిని ప్రచారం చేస్తే చట్ట ప్రకారం చర్యలు ఉంటాయి.
అయిజ ఎస్ ఐ విజయభాస్కర్.

జోగులాంబ గద్వాల 2 నవంబర్ 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:- ఐజ మున్సిపాలిటీ అసత్యాలను, ఆధారాలు లేని వాటిని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అయిజ ఎస్ఐ విజయభాస్కర్ పేర్కొన్నారు. మండలంలో ఎవరు పడితే వారు, ఏది పడితే అది, ఇష్టారాజ్యంగా సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు.? ఆధారాలు లేకుండా పెట్టే పోస్టులకు అప్లోడ్ చేసే వారిని బాధ్యులుగా చేస్తూ వారిపై చర్యలు తీసుకుంటాం. ముందుగా తమ దృష్టికి తీసుకురావాలని, మా వివరణ తీసుకున్న తర్వాత మాత్రమే సామాజిక మాధ్యమాలలో అప్లోడ్ చేయాలన్నారు. అలా కాకుండా నేరుగా సామాజిక మాధ్యమాల్లో పెడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టే ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని ఎస్సై విజయ భాస్కర్ సూచించారు.