సాగునీటి ప్రాజెక్టుల భూసేకరణ వేగవంతం చేయాలి

Aug 21, 2026 - 17:24
 0  2
సాగునీటి ప్రాజెక్టుల భూసేకరణ వేగవంతం చేయాలి

ఆర్‌అండ్‌ఆర్‌ సమస్యలను పరిష్కరించాలి.

జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్.

జోగులాంబ గద్వాల 21 ఆగస్టు 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల భూ సేకరణ వేగవంతం చేయాలని, ఆర్‌ అండ్‌ ఆర్‌ సమస్యలను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. సాగునీటి ప్రాజెక్టుల పురోగతికి భూసేకరణ, ఆర్ అండ్ ఆర్, అటవీ సంబంధిత సమస్యలపై శుక్రవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి, ఇంజనీరింగ్ ఉన్నతాధికారులు రమేష్ బాబు, శ్రీధర్, శ్రీనివాసులుతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్లో సమీక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి అవసరమైన నిధులు ఇప్పటికే విడుదల చేసినందున పనులను వేగవంతం చేయాలన్నారు. ప్రాజెక్టుల వారీగా భూములు కోల్పోయిన నిర్వాసితులకు నిర్దేశిత సమయంలోగా పరిహారం చెల్లించాలన్నారు. ఆర్థిక శాఖ నుంచి నిధులు విడుదల కావడం, కలెక్టర్‌ పీడీ ఖాతాలలో జమ కావడమే చెల్లింపు పూర్తయినట్లు భావించరాదని మంత్రి స్పష్టం చేశారు. మంజూరైన మొత్తం చివరకు సంబంధిత లబ్ధిదారుడికి చేరడమే అసలు లక్ష్యమన్నారు. అవసరమైన అన్ని ప్రక్రియలు పూర్తై నిధులు అందుబాటులో ఉన్న చోట వెంటనే పరిహారం చెల్లించాలని ఆదేశించారు.

సాగునీటి ప్రాజెక్టుల పురోగతికి సంబంధించిన అటవీ సమస్యలు, పెండింగ్‌ చెల్లింపులు, క్లియరెన్సులు, ఇతర అడ్డంకులను గుర్తించి ఇరిగేషన్‌ శాఖకు వివరాలు సమర్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం స్థాయిలో జోక్యం అవసరమైన అంశాలను ఉన్నతాధికారుల దృష్టికి తక్షణమే తీసుకెళ్లాలని సూచించారు. భూసేకరణ, పరిహారం చెల్లింపులు, ఆర్ అండ్ ఆర్, అటవీ సమస్యలు, ఆర్థిక అనుమతులు, టోకెన్లు, ఇతర ఆర్థిక, ప్రక్రియాపరమైన కారణాలతో ఏ సాగునీటి ప్రాజెక్టు ఆలస్యమవుతున్నా సంబంధిత కలెక్టర్‌, చీఫ్‌ ఇంజినీర్‌ సమస్యను స్పష్టంగా గుర్తించి వెంటనే ప్రభుత్వానికి నివేదించాలని ఆదేశించారు. ఆయా సమస్యలను సంబంధిత శాఖలతో సమన్వయం చేసి త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. గద్వాలలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి సంబంధిత అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. వీసి అనంతరం కలెక్టర్ జిల్లా అధికారులకు తగు సూచనలు చేశారు. ఈ సమావేశంలో భూ సేకరణ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కృష్ణ, నీటిపారుదల శాఖ ఎస్ఈ కేశవరావు, మల్లికార్జున్, తదితరులున్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333