సర్వర్ ఉద్యమ స్ఫూర్తిని కొనసాగిద్దాం
సర్వర్ ఉద్యమ స్ఫూర్తిని కొనసాగిద్దాం
ఎంసీపీఐ(యూ) పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గోనె కుమారస్వామి, జిల్లా కార్యదర్శి గుండెబోయిన చంద్రయ్య.
రామచంద్రపురంలో కమ్యూనిస్టు నేత సర్వర్ స్మారక స్థూపం వద్ద ఘన నివాళులర్పించిన ఎంసీపీఐ(యూ) పార్టీ నేతలు, కుటుంబ సభ్యులు, గ్రామస్తులు.
తెలంగాణ వార్త ములుగు (మల్లంపల్లి) : నిరుపేదల భూ హక్కుల కోసం, పేదరిక నిర్మూలన, సమానత్వం కోసం ఉద్యమించి ప్రాణ త్యాగం చేసిన ఎంసీపీఐ(యూ) నేత కామ్రేడ్ ఎండి. సర్వర్ ఆశయాలతో పాటు ఉద్యమ స్ఫూర్తిని కొనసాగిద్దామని ఎంసీపీఐ(యూ) రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గోనె కుమారస్వామి, జిల్లా కార్యదర్శి గుండెబోయిన చంద్రయ్య అన్నారు,
పీడిత ప్రజల అభ్యున్నతికై పోరాడిన ఉద్యమనేత కామ్రేడ్ ఎండి సర్వర్ 39వ వర్ధంతి సందర్భంగా బుధవారం మల్లంపల్లి మండలం రామచంద్రపురం గ్రామంలో ఆయన స్మారక స్థూపం వద్ద ఎంసీపీఐ(యూ) పార్టీ నేతలు,కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కలిసి, జెండా ఎగరవేసి, పూలమాలలతో ఘన నివాళులర్పించారు,
అనంతరం కుమారస్వామి, చంద్రయ్య మాట్లాడుతూ అణగారిన వర్గాల, సాయుధ రైతాంగ ప్రజల కోసం త్యాగధనుడు యం.డి. సర్వర్ చేసిన సేవలు మరువలేనివని, పేదరిక నిర్మూలనకు కోసం నిరంతరం ఉద్యమించిన సర్వర్ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా చిరస్మరీనీయులుగా నిలిచారని వారు అన్నారు,ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, ఎంసీపీఐ(యూ) సభ్యులు ఎన్ రెడ్డి హంసారెడ్డి, మాస సావిత్రి, కర్రు రాజిరెడ్డి, నీలం రవి, రాస రాజన్న,కొమురయ్య, గ్రామ పెద్దలు దొంతి రాంరెడ్డి, దొంతి ప్రతాప్ రెడ్డి, బేతి రాజిరెడ్డి,సాయిరెడ్డి,వీరారెడ్డి,లక్ష్మారెడ్డి, గ్రామస్థులు పాల్గొన్నారు.