సర్పంచ్ కొత్త వెంకటరెడ్డి ఆధ్వర్యంలో ప్రాథమిక పాఠశాల తనిఖీ
07-09-2026 తెలంగాణ వార్త ప్రతినిధి చిన్నంబావి మండలం.
చిన్నంబావి మండల పరిసర ప్రాంతమైన గూడెం గ్రామంలో సర్పంచ్ కొత్త వెంకట్ రెడ్డి గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలను తనిఖీ చేయడం జరిగింది. విద్యార్థులు మధ్యాహ్న భోజనం చేసేటప్పుడు విద్యార్థుల పక్కనే ఉండి విద్యార్థులు తినే భోజనం లో క్వాలిటీ, క్వాంటిటీ పరిశీలించారు. ఉపాధ్యాయులతో మాట్లాడుతూ మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందించాలని సూచించారు. ఆ తర్వాత పాఠశాల ఆవరణంలో చెడిపోయిన చేతిపంపు బోరును పరిశీలించి త్వరలోనే బోరును రిపేర్ చేయిస్తానని, స్కూల్లో విద్యుత్ కలెక్షన్లు సరిగా లేక పోవటం వలన విద్యుత్ అధికారులతో మాట్లాడి విద్యుత్ లైన్ క్లియర్ చేయడం జరిగింది. సర్పంచ్ కొత్త వెంకటరెడ్డి తో పాటు గ్రామపంచాయతీ సెక్రటరీ, గ్రామస్తులుపాల్గొన్నారు.