సర్పంచుల పోస్టు కార్డు ఉద్యమ, నిరసన

27-03-2025 తెలంగాణ వార్త ప్రతినిధి చిన్నంబావి మండలం.
తెలంగాణ సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గూడూరు లక్ష్మీనరసింహారెడ్డి.
తెలంగాణ సర్పంచు ల ప్రధాన కార్యదర్శి ప్రణీల్ చందర్. గారి ఆధ్వర్యంలో
సర్పంచుల పోస్టు కార్డు ఉద్యమ నిరసన.
తెలంగాణ వ్యాప్తంగా మన యొక్క గ్రామపంచాయతీలలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి, దేశంలోనే తెలంగాణ పల్లెలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దితే ప్రభుత్వం మన పెండింగ్ బిల్లులు విడుదల చేయకుండా 16 నెలలుగా సర్పంచులను తీవ్ర ఇబ్బందికి గురిచేస్తోంది. అనేక నిరసనలు,ఉద్యమాలు చేసినా ప్రస్తుత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది..ఈ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ సర్పంచుల పెండింగు బిల్లులు చెల్లించాలని రేపు అనగా 28/03/2025 శుక్రవారం సర్పంచుల పోస్టుకార్డు ఉద్యమం, నిరసన ల కు రాష్ట్ర కార్యవర్గం పిలుపునిస్తుంది.కావున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 12769 మంది సర్పంచులందరూ మీ మీ గ్రామముల నుండి మన గోస ముఖ్యమంత్రి గారికి చేరే విధంగా పోస్టు కార్డు ద్వారా పెండింగు బిల్లులు చెల్లించాలని ఉత్తరం రాసి పోస్టు కార్డు ఉద్యమం, నిరసనలో పాల్గొని నిరసన తెలపవలసిందిగా మనవి.
సర్పంచుల ఐక్యత వర్ధిల్లాలి.
మీ
గూడూరు లక్ష్మీ నర్సింహ్మ రెడ్డి(LN రెడ్డి)
సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, తెలంగాణ.
ప్రణీల్ చందర్
సర్పంచుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.