సమానత్వం, సమాజహితమే MRPS ఉద్యమ గమ్యం

Jul 26, 2024 - 17:39
Jul 26, 2024 - 18:55
 0  3
సమానత్వం, సమాజహితమే MRPS ఉద్యమ గమ్యం

తెలంగాణ వార్త ఆత్మకూరు యస్ సమానత్వం, సమాజహితమే MRPS ఉద్యమ గమ్యం 30 ఏళ్లుగా MRPS ఉద్యమానికి అండగా నిలిచిన అన్ని వర్గాల ప్రజలకు కృతజ్ఞతలు*.MSP జిల్లా అధ్యక్షులు యాతాకుల రాజన్న  ఎస్సీ వర్గీకరణ సాధన కోసం దృడ సంకల్పంతో పోరాడుదాo ఆత్మకూరు ఎస్ : మహాజననేతా మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారి అదేశానుసారo గత 30ఏళ్లుగా MRPS 30వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆత్మకూరు ఎస్ మండల పరిధిలోని రామన్న గూడెం గ్రామంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు మేడి కృష్ణ మాదిగ అద్యక్షతన జరిగిన ఆవిర్భావం కార్యక్రమానికి ముఖ్యాతిదిగా MSP జిల్లా అధ్యక్షులు యాతాకుల రాజన్న మాదిగ హాజరై MRPS జెండాను ఆవిష్కరించారు. అనంతరం యాతాకుల రాజన్న మాట్లాడుతూ పాలకుల కుట్రలను చేదిస్తు, ఉద్యమ ద్రోహుల వెన్నుపోట్లను భరిస్తూ, స్వార్థపరుల కల్పించే అడ్డంకులను ఎదుర్కొంటూ ఎమ్మార్పీఎస్ ఉద్యమం 30 ఏండ్లుగా సజీవంగా నిలబడిందంటే మంద కృష్ణ మాదిగ సమర్థవంతమైన నాయకత్వమే కారణమని అన్నారు. 76యేండ్ల స్వతంత్ర్య భారతదేశంలో సుదీర్ఘంగా నడుస్తున్న అతి పెద్ద ఏకైక సామాజిక ఉద్యమం ఎమ్మార్పీఎస్ మాత్రమే అని అన్నారు. ఇన్ని ఏండ్ల పోరాటంలో మాదిగ జాతికి ఆత్మగౌరవం, అస్థిత్వం, గుర్తింపుతో పాటు మొదటి దశలో ఎస్సీ వర్గీకరణ సాధించడం ద్వారా 25 వేల ఉద్యోగాలను ఎమ్మార్పీఎస్ అందించిందని అన్నారు. అలాగే మానవతా దృక్పథంతో గుండె జబ్బుల చిన్నారుల కోసం, వికలాంగులు వృద్దులు వితంతువుల కోసం, తెలంగాణ అమరవీరుల కోసం, హత్యలకు అత్యాచారాలకు గురైన మహిళల కోసం ఇలా ఎన్నో పోరాటాలు చేసి వారి సమస్యలు పరిష్కరించడం జరిగిందని అన్నారు. ప్రస్తుతం అనాథ పిల్లల సంక్షేమం కోసం MRPS పోరాటం చేస్తుందని అన్నారు. మాదిగల కోసమే పోరాటం ప్రారంభించినా అన్ని వర్గాల సంక్షేమం కోసం పోరాటం చేస్తుందని అన్నారు. సమాజంలో నెలకొని ఉన్న సామాజిక ఆర్థిక రాజకీయ అసమానతలను రూపుమాపి సాంఘిక సమానత్వం సాధించడమే MRPS ఉద్యమ గమ్యమని, సమాజహితం కోసం పునరంకితం అవుతామని అన్నారు . 30 ఏళ్లుగా MRPS ఉద్యమాన్ని గుండెల్లో పెట్టుకొని కాపాడుకుంటున్న మాదిగ ప్రజలకు , ఉద్యమానికి అండదండలు అందించిన అన్ని వర్గాల ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు చింత వినయ్ బాబు మాదిగ ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు మేడి కృష్ణ మాదిగ ఎమ్మెస్ ఎఫ్ జిల్లా నాయకులు బత్తుల వెంకట రాములు మాదిగ మండల ప్రధాన కార్యదర్శి తిప్పర్తి గంగరాజు మాదిగ మండల అధికార ప్రతినిధి మిర్యాల చిన్ని మాదిగ మండల సీనియర్ నాయకులు పాల్వాయి వెంకటేష్ మాదిగ పత్తేపురపు మహేష్ కోట ఎలందరు బత్తుల దుర్గాప్రసాద్ బత్తుల పవన్ బత్తుల నరేందర్ జలగం వెంకయ్య బత్తుల ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు