సంగెం మూసి పునర్జీవం సభకు బయలుదేరిన వెల్దేవి కాంగ్రెస్ పార్టీ నాయకులు

అడ్డగూడూరు 08 నవంబర్ 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలోని వెల్దేవి గ్రామానికి చెందిన గ్రామశాఖ అధ్యక్షులు మంటిపేల్లి గంగయ్య ఆధ్వర్యంలో తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేల్ ఆదేశాల మేరకు వెల్దేవి గ్రామం నుండి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు సీఎం ఎనముల రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు, మూసి పునర్జీవం సభకు వెల్దేవి గ్రామం నుండి భారీ సంఖ్యలో బయలుదేరి వెళ్లారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై బిఆర్ఎస్ పార్టీ కార్యకర్త కోటమర్తి రమేష్ కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షులు మంటిపెల్లి గంగయ్య ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు మంటిపెల్లీ గంగయ్య, సీనియర్ నాయకులు రాచకొండ శీను గౌడ్, మోత్కూర్ మార్కెట్ మాజీ డైరెక్టర్ బోడ యాదగిరి, రాచకొండ రవి,బోడ సత్తయ్య, బోడ రాజు,బోడ శీను, నిర్మల వెంకన్న, పిల్లి వెంకన్న,రోడ్డు బిక్షం, జూలూరి వెంకట్ మల్లు, మిట్టగడుపుల సైదులు, గజ్జి రామచంద్ర, కుంభం రామలింగం, చిలుకూరి వెంకట్ నర్సు, ఉడుగు పరశురాములు,మంటిపల్లి రాజు, నిమ్మల నవీన్, ఎస్.కె. దస్తగిరి, ఎస్.కె. జాన్ పాషా తదితరులు పాల్గొన్నారు.