శ్రీ సరస్వతి విద్యా నికేతన్ లో ఉగాది వేడుకలు

Mar 29, 2025 - 22:12
 0  7
శ్రీ సరస్వతి విద్యా నికేతన్ లో ఉగాది వేడుకలు

 చర్ల  29-03-2025                                                                                                                                                    శ్రీ సరస్వతి విద్యానికేతన్ అందరికి ఉగాది శుభాకాంక్షలు

శ్రీ సరస్వతీ విద్యానికేతన్ స్కూల్లో తెలుగు సంవత్సరాది సందర్భంగా నూతన సంవత్సరాన్ని స్వాగతిస్తూ తెలుగు పండుగను జరుపుకున్నారు.విద్యార్థిని విద్యార్థులకు తెలుగు సంవత్సరాది గురించి ఉగాది పచ్చడి గురించి

 బెల్లం — ఆనందానికి సంకేతం, 

ఉప్పు— జీవితంలో ఉత్సాహానికి,

వేప పువ్వు—చేదు జ్ఞాపకాలకి, 

చింతపండు—నేర్పుగా వ్యవహరించే తీరుకు 

పచ్చి మామిడి—కొత్త సవాళ్లను ఎదుర్కొనే దానికి,

కారం—కోపం సహనం కోల్పోయే పరిస్థితులకు సంకేతం అని, ఉగాది పచ్చడి ఆరు రుచులు కలయిక , ఆరు రోజుల సారం అదే కదా జీవితం పడిన లేచిన అడుగు ముందుకే వెయ్యాలి అని, పంచాంగం శ్రవణం చేసి మంచి చెడులను గ్రహించి జాగ్రత్త వహించండి అని పాఠశాలలో వివరించారు. శ్రీ సరస్వతి విద్యానికేతన్ నుండి శ్రేయోభిలాషులందరికీ శ్రీ విశ్వావాసు నామ సంవత్సర శుభాకాంక్షలు నమస్తే????