శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం పెద్దదిన్నె నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవం

ముఖ్య అతిథులుగా మాజీ శాసనసభ్యులు ఏఐసీసీ కార్యదర్శి డాక్టర్ ఎస్ ఏ సంపత్ కుమార్
జోగులాంబ గద్వాల 12 మే 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి : ఇట్టి దేవస్థానం కమిటీ సభ్యులుగా నియమింపబడిన వారికి శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఆలయంలో జరగబోయే ప్రతి ఒక్క విషయాలలో కమిటీ సభ్యులు అందరూ కలిసి ముందుకు తీసుకువెళ్లాలని ఆలయ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం సాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని అదేవిధంగా గ్రామానికి సంబంధించిన విషయాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ పేదల పార్టీ బడుగు బలహీన వర్గాల పార్టీ విషయాన్ని మీరందరూ మరువక అన్ని విధాలుగా మీరు కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటూ రైతులకు యువకులకు వృద్ధులకు ప్రతి ఒక్కరికి అభివృద్ధి పథంలో నడిపించడమే లక్ష్యంగా పెట్టుకుందని సంపత్ కుమార్ అన్నారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం పెద్దదిన్నె గ్రామంలో ఉన్నటువంటి నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియపరుస్తూ అలంపూర్ నియోజకవర్గంలో మిగిలి ఉన్న దేవస్థానాలు కానీ అభివృద్ధిలోకి రాబోతున్నాయని తెలియపరిచారు ఇట్టి దేవస్థానానికి పాలకవర్గానికి నియమితులైన వారు ఎండి జయసింహ చైర్మన్. పాండురంగయ్య ఎక్స్ అఫ్షియా మెంబర్. వెంకటరమణ శెట్టి సభ్యులు జి నారాయణ సభ్యులు ఆవుల జయన్న సభ్యులు వెంకటేష్ సభ్యులు దొడ్ల నవత సభ్యులు కే నాగలక్ష్మి సభ్యులుగానియమింపడం జరిగిందని అన్నారు.
ఈ కార్యక్రమంలో జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయ చైర్మన్ కొంకల నాగేశ్వర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ నీలి శ్రీనివాసులు, మార్కెట్ యార్డ్ చైర్మన్ దొడ్డప్ప, వైస్ చైర్మన్ పచ్చర్ల కుమార్, ఇటిక్యాల మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రుక్మానందరెడ్డి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సంకటి రాజేష్, సోమిరెడ్డి ఎక్స్ ఎంపిటిసి, శ్రీనాథ్ రెడ్డి మాజీ సర్పంచ్, మద్దిలేటి పవన్ అడ్వకేట్, ఆయా మండల పార్టీ అధ్యక్షులు జిల్లా అధ్యక్షులు మార్కెట్ యార్డ్ డైరెక్టర్లు ఆలయ ధర్మకర్తలు తదితరులు ఉన్నారు.