శ్రీ కళ్యాణ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం లో తొలి ఏకాదశి ఉత్సవాల వేడుకల ఆహ్వానం

Jul 24, 2026 - 21:39
 0  0
శ్రీ కళ్యాణ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం లో తొలి ఏకాదశి ఉత్సవాల వేడుకల ఆహ్వానం

 జోగులాంబ గద్వాల 24 జూలై 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి : గద్వాల. కేంద్రంలో కృష్ణా నది తీరాన వెలసిన అతి పురాతన దేవాలయం ప్రస్తుతము గద్వాల తిరుపతిగా విరాజిల్లుతున్నటువంటి శ్రీ శ్రీ కళ్యాణ లక్ష్మి వెంకటేశ్వర స్వామి దేవస్థానం దినదినాభివృద్ధి చెందుతూ పునరుద్ధరణ నిర్మాణ పనులు కొనసాగిస్తూ స్వామివారి కైంకర్యాలు చేస్తూ విశేషమైన పర్వదినాల్లో ఎంతో వైభవంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు అందులో భాగంగా తొలి ఏకాదశి శయన ఏకాదశి శ్రీమహావిష్ణువు యోగనిధులలోకి ఉపక్రమించే పరమ పవిత్రమైన రోజున విశేషమైన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఉదయం మూలవిరాట్ కు ప్రత్యేక అలంకరణతో భక్తులకు దర్శనం మరియు విచ్చేసిన భక్తులందరి చేత ఉత్సవమూర్తులకు గోక్షిరాభిషేకం( పాలను దేవస్థానం వారు సమకూరుస్తారు) మరియు ఉచితంగా తులసి మొక్కల పంపిణీ కార్యక్రమం మరియు సాయంత్రం గోపూజ మహోత్సవం, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఉత్సవమూర్తులను ఆలయ మాడవీధులలో గ్రామంలో గ్రామోత్సవ సేవ పల్లకి సేవ నిర్వహించి అనంతరం విచ్చేసిన భక్తులకు అల్పాహార విందు ఏర్పాటు చేయనున్నారు ఇట్టి మహత్తరమైన రోజున హిందూ బంధువులందరూ దర్శించి స్వామివారి తీర్థ ప్రసాదము స్వీకరించి భగవంతుని అనుగ్రహం పొందగలరని శ్రీ కళ్యాణ లక్ష్మి వెంకటేశ్వర స్వామి దేవస్థానం కమిటీ వారు తెలియజేశారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333