శ్రీశైలం నిర్వహితుల సమస్యలు పరిష్కారమయ్యే వరకు నేను నిద్రపోను జూపల్లి

Aug 11, 2025 - 21:30
 0  4
శ్రీశైలం నిర్వహితుల సమస్యలు పరిష్కారమయ్యే వరకు నేను నిద్రపోను జూపల్లి

11-8-2025 తెలంగాణ వార్త ప్రతినిధి చిన్నంబావి మండలం , 

 వనపర్తి, గద్వాల, నాగర్ కర్నూల్ జిల్లాల  శ్రీశైలం నిర్వహితుల98 జీవో నిర్వాసితులకు త్వరలో శుభవార్త – మంత్రి జూపల్లి కృష్ణారావు హామీ.

~కొల్లాపూర్ జూపల్లి గెస్ట్ హౌస్ వద్ద 

, శ్రీశైలం ప్రాజెక్టు ముంపు బాధితులు  రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావును కలిశారు. జూపల్లి కృష్ణారావుకు పూల బొకేలు అందించి, శాలువా కప్పి మంత్రివర్యులను సన్మానించిన నిర్వాసితులు,

 శ్రీశైలం నిర్వసితుల  సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి. త్వరలోనే తీసుకెళ్తా?

 జూపల్లి సానుకూల స్పందన –15 రోజుల్లో శుభవార్త రానుంది.

సమస్య పరిష్కారం అయ్యే వరకు,నేను,నిద్రపోను”మంత్రి జూపల్లి కృష్ణారావు 

 జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ, “మూడు జిల్లాల కలెక్టర్లతో త్వరలో సమావేశమై, 98 జీవో నిర్వాసితుల సమస్యకు త్వరిత పరిష్కారం తీసుకొస్తాము” అని హామీ ఇచ్చారు.

 జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ మీరు త్యాగం చేసిన శ్రీశైలం ప్రాజెక్టులో ముంపుకు గురై సర్వస్వం కోల్పోయిన నిర్వాసితులకు నేటికీ కష్టాలు తీరలేదు  అని అన్నారు. శ్రీశైలం నిర్వాసితులుగా ఉన్న గ్రామాలకు ఏమిస్తే వాళ్ళ ఋణం తీర్చుకోవాలని సూచించారు శ్రీశైలం ప్రాజెక్టు ముంపు బాధితులకు 98 జీవో ద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించవలసి ఉండే కానీ నెరవేరలేదని వారికి కనీసం కొంత మేరకు పంచాయతీ సెక్రెటరీ లేదా లస్కర్ ఉద్యోగాలు ఇవ్వాలని లేకపోతే 55 60 సo"మధ్యల గల వయసు ఉన్న వారికి ఒక్కొక్క కుటుంబానికి 25 లక్షలు నష్టపరిహారం చెల్లించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లామని అన్నారు. ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించారని అన్నారు 15 రోజుల్లోనే 98 జీవో నిర్వాసితులు మంచి శుభపరిమాణం వింటారని మీ కళ నెరవేర బోతుందని త్వరలో మూడు జిల్లాల కలెక్టర్ తో సమావేశమైన అతి త్వరలోనే సమస్య పరిష్కారం అయ్యే విధంగా చూస్తానన్నారు. నిర్వాసితుల పరిష్కారమయ్యే వరకు నిద్రపోనని అన్నారు.

ఈ కార్యక్రమంలో చిన్నంబావి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ సందర్భంగా మాట్లాడుతూ శ్రీశైలం జల విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణంలో ఎన్నో కుటుంబాల త్యాగాలున్నాయని ఇప్పటికీ వారి జీవితాల్లో చీకటిని తొలగించి వెలుగులు నింపేందుకు మీ వెంటే ఉండి ఉద్యోగాలు వచ్చేవరకు మీ వెన్నంటేనే ఉంటామని మండల నాయకులు 98 జీవో నిర్వాసితులకు అండగా ఉంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో చిన్నంబావి కాంగ్రెస్ మండల నాయకులు కొత్త కళ్యాణ్, జంగబీచ్ పల్లి యాదవ్,  మండల అధ్యక్షుడు శేఖర్ యాదవ్, వడ్డెమాను బిచ్చన్న శ్రీశైలం నిర్వాసితులు డాగోజి,గోవిందు, గూడెం విష్ణు సాగర్, శ్రీనివాసులు, ఉత్తరా గౌడ్, బీ.శ్రీనివాసులు,నటరాజ్కొ,త్తకోట కృష్ణ,షబ్బీర్ అలీ,వడ్డెమాన్ విష్ణు వర్మ,  రామకృష్ణ,మంచాలకట్ట బాలయ్య, కృష్ణ కురుమూర్తి, జెట్ పోల్ శీను, మంచాలకట్ట మల్లేశ్వరం సోమశిల చిన్నంబావి నుండి నిర్వహితులుు దాదాపు మూడు వందల నిర్వాసితులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Vishnu Sagar Chinnamabavi Mandal Reporter Wanaparthi District Telangana State