శాలిలింగటం గ్రామంలో అంబేద్కర్ కమిటీ ఎన్నిక

Mar 29, 2026 - 22:59
Mar 29, 2026 - 23:00
 0  1
శాలిలింగటం గ్రామంలో అంబేద్కర్ కమిటీ ఎన్నిక

శాలిగౌరారం 29 మార్చి 2026 తెలంగాణవార్త రిపోర్టర్:– నల్గొండ జిల్లా శాలిగౌరారం మండల పరిధిలోని శాలినింగోటం గ్రామంలో అంబేద్కర్ కమిటీనీ ఎన్నుకున్నారు.గ్రామంలోని యువకులు ఆధ్వర్యంలో గ్రామ శాఖ అధ్యక్షులుగా కొప్పుల నోబుల్ బాబు,ఉపాధ్యక్షులుగా చింతలచెరువు ఇంద్రసేన, మరియు బండారు కిరణ్,ప్రధాన కార్యదర్శిగా చింత శ్రీకాంత్, కార్యదర్శిగా కొప్పుల విజయ్, కోశాధికారిగా చింత సైదులును గ్రామ పెద్దలు యువకులు అందరూ కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అంబేద్కర్ కమిటీ గ్రామశాఖ అధ్యక్షులు కొప్పుల నోబెల్ బాబు మాట్లాడుతూ..నా ఎన్నికకు సహకరించి న నా జాతి అన్నదమ్ములకు నా గ్రామ యువకులకు,పెద్ద మనుషులకు, నా జాతి ప్రజలకు నా సహాయ శక్తుల మేరకు మేలు చేస్తానని ఎల్లవేళలా తోడుంటానని అన్నారు.ఈ కార్యక్రమంలో అంబేద్కర్ కాలనీ పెద్దమనుషులు యువకులు తదితరులు పాల్గొన్నారు.