శాంతినగర్ ఎస్ఐగా బాధ్యతలు స్వీకరణ

జోగులాంబ గద్వాల 15 ఫిబ్రవరి 2025 తెలంగాణ వార్త ప్రతినిధి: శాంతినగర్ ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించిన నాగశేఖర్‌రెడ్డి శనివారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ టి.శ్రీనివాస్ రావును మర్యాదపూర్వకంగా కలిశారు. అంతకు ముందు శాంతినగర్ పోలీసుస్టేష్ సబ్ ఇన్సపెక్టర్‌గా నాగశేఖర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ మాట్లాడు తూ మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తామ న్నారు. అసాంఘిక కార్యక్రమా లు, జూదం, అక్రమ మద్యం తదితర వాటిపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. పోలీసు సిబ్బంది నూతన ఎస్‌ఐకి శుభాకాంక్షలు తెలిపారు. ఇక్కడ పనిచేస్తున్న ఎస్‌ఐ సంతోష్ వనపర్తి జిల్లా వీఆర్ కు బదిలీపై వెళ్ళారు.