వెల్దేవి గ్రామంలో ఎమ్మార్పీఎస్ గ్రామశాఖ
అధ్యక్షుడిగా నిర్మల సందీప్ ఏకగ్రీవంగా ఎన్నిక

అడ్డగూడూరు 23 నవంబర్ 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలోని వెల్దేవి గ్రామంలో ఎమ్మార్పీఎస్ గ్రామ కమిటీని ఏర్పాటు చేశారు.రాష్ట్ర అధ్యక్షులు మేడి పాపన్న ఆదేశానుసారం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బాలెoల పరశురాములు అడ్డగూడూరు మండల ఇంచార్జ్ ఇటికాల అంజయ్య సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.వెల్దేవి ఎమ్మార్పీఎస్ గ్రామశాఖ అధ్యక్షుడిగా నిర్మల సందీప్ ను ఎన్నుకోవడం జరిగింది.నిర్మల సందీప్ మాట్లాడుతూ..నా ఎన్నికకు సహకరించిన పెద్దలకు, నాయకులకు ముందుగా వందనములు నేను వారికి ఎల్లప్పుడు రుణపడి ఉంటానని అన్నారు.నా మాదిగ జాతికి గ్రామంలో ఏ ఇబ్బంది వచ్చినా నా సహాయ శక్తుల ముందుండి పోరాడతానని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బాలెoల పరుశరాములు,మండల ఇంచార్జి ఇటికాల అంజయ్య,బోడ సత్తయ్య,బోడ పెద్ద వెంకన్న,బోడ చిన్న వెంకన్న,ఉడుగు మారయ్య,నిర్మల మారయ్య, నిర్మల వెంకటేష్,మిట్టగడుపుల యాదగిరి,ఉడుగు పరుశురాములు తదితరులు పాల్గొన్నారు.