వివిధ రంగాల్లో మహిళలే బలవంతులు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన

జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల.

Mar 8, 2024 - 19:15
 0  19
వివిధ రంగాల్లో మహిళలే బలవంతులు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన
వివిధ రంగాల్లో మహిళలే బలవంతులు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన
వివిధ రంగాల్లో మహిళలే బలవంతులు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన
వివిధ రంగాల్లో మహిళలే బలవంతులు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం ఐ డి ఓ సి కార్యాలయంలో రెవెన్యూ మహిళా ఉద్యోగులు ఏర్పాటుచేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలు పురుషులతో సమానంగా పోటీ పడుతున్నారన్నారు. మహిళా లేకపోతే ప్రపంచం నడవదని తెలిపారు. నదులు పేరు మహిళలు పేరునే ఉన్నాయని, మహిళలు వద్ద శాంతి సహనం ఉందన్నారు. పురుషుల కంటే మహిళలు బలంగా ఉన్నట్లు చెప్పారు. మహిళలలు ఎక్కడ పోటీ పడాలో అక్కడే పోటీ తున్నారని కొనియాడారు. మహిళల్లో మాతృత్వం ఉందన్నారు. మహిళా దినోత్సవం జరిపే అవసరం ఎందుకు వచ్చిందని ఆలోచన చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రపంచంలో ఉన్న దేశాల్లో కొన్ని కారణాల వల్లన కొంత మంది పై కొన్ని పరిమితులు విధించించడం జరిగిందని, దానివలన వచ్చే చిన్న చూపును తొలగించడానికి సాంఘిక భావం తెలపడానికి ఈ మహిళా దినోత్సవమని వివరించారు.  మహిళలు పోషిస్తున్న పాత్రే కీలకమన్నారు. అనంతరం కేక్ కట్ చేసి మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు కలెక్టర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ ఏవో గన్యా, కలెక్టరేట్ సిబ్బంది శకుంతల, రమాదేవి, హైందవి, పద్మ, సౌజన్య, స్వాతి,నవ్య, తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333