వివిధ గ్రామాలలో వడ్లు కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

తిరుమలగిరి 17 అక్టోబర్ 2025 తెలంగాణ వార్త రిపోర్టర్: సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండల పరిధిలోని తొండ ,రాజ్ నాయక్ తండ, మామిడాల ,జలాల్పురం ,వెలిశాల వివిధ గ్రామంలోని ఎఫ్ టి ఓ మరియు ఐకెపి మహిళా సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తిరుమలగిరి మార్కెట్ యార్డ్ చైర్మన్ ఎల్సోజు నరేష్ చామంతి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు శ్రమించి పండించిన ప్రతి ధాన్యాన్ని ప్రభుత్వం పూర్తిగా కొనుగోలు చేస్తుందని తెలిపారు. నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి, ప్రభుత్వం నిర్ణయించిన గిట్టుబాటు ధరలు పొందాలని రైతులను ఆయన కోరారు. రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ఎవరూ ఇబ్బందులు పడకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తిరుమలగిరి ఏవో నాగేశ్వరరావు, తహసిల్దార్ హరి ప్రసాద్, పి ఎస్ ఎస్ చైర్మన్ పాలెపు చంద్రశేఖర్ శశిధర్ , ఏపిఎం లక్ష్మి , జుమ్మిలాల్ ,వేణ రావు ,దాచేపల్లి వెంకన్న ,సుధాకర్ ,రాము గౌడ్ ,సరస్వతి ,సోనీ వివిధ గ్రామాల కార్యదర్శులు మరియు జిపిఓలు మహిళా సంఘాలు ప్రజలు రైతులు పాల్గొన్నారు.