విద్యార్థుల ఉజ్వల భవిష్యత్ కై ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలి

May 5, 2026 - 22:03
 0  88
విద్యార్థుల  ఉజ్వల భవిష్యత్ కై ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలి

తిరుమలగిరి 06 మే 2026 తెలంగాణ వార్త రిపోర్టర్

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదును పెంచడమే లక్ష్యంగా జలాల్‌పురంలో 'బడిబాట' ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్  బెట్టం గణేశ్వరి  ప్రారంభించారు 6వ తరగతిలో చేరబోయే విద్యార్థులు మరియు ప్రస్తుతం ప్రైవేట్ పాఠశాలలకు వెళ్తున్న విద్యార్థుల తల్లిదండ్రులను ఉపాధ్యాయ బృందం స్వయంగా కలిశారు.

​ప్రభుత్వ పాఠశాల సౌకర్యాలు ప్రభుత్వ పాఠశాలల్లో అందుబాటులో ఉన్న నాణ్యమైన విద్య, ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు, మధ్యాహ్న భోజనం మరియు అనుభవజ్ఞులైన ఉపాధ్యాయుల బోధన గురించి తల్లిదండ్రులకు వివరించారు విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని కోరారు.

​ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (ZPHS) జలాల్‌పురం మరియు ప్రాథమిక పాఠశాల (MPPS) జలాల్‌పురం ప్రధానోపాధ్యాయులు, సహోపాధ్యాయులు మరియు AAPC చైర్మన్ మరియు సభ్యులు పాల్గొన్నారు.

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి