విద్యార్థుల ఆరోగ్యం పై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు

Jul 8, 2026 - 20:38
 0  2
విద్యార్థుల ఆరోగ్యం పై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు
విద్యార్థుల ఆరోగ్యం పై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు

 వామన్ పల్లి ప్రభుత్వ పాఠశాలను తనిఖీ చేసిన మండల విద్యాధికారి రవీంద్రబాబు.

మండల పరిధిలోని వామన్ పల్లి పాఠశాలను మండల విద్యాశాఖ అధికారి రవీంద్ర బాబు సందర్శించడం జరిగింది.పాఠశాల గురించి సోషల్ మీడియాలో వచ్చిన అంశాలను పరిగణలోకి తీసుకొని పాఠశాల సందర్శించి, అక్కడ ఉన్న అన్నిటిని పరిశీలించి  పాఠశాల లో ఉన్న బియ్యం ను పరిశీలించడం జరిగింది. ఎటువంటి పురుగులు లేవని మంచి బియ్యం తో భోజనాన్ని తయారు చేస్తున్నారని తెలుసుకోవడం జరిగింది. మధ్యాహ్న భోజనాన్ని రుచికరంగా చేయాలని వంట వారికి తెలియజేయడం జరిగింది. విద్యార్థులకు అందించే మధ్యాహ్నం భోజనం ఉంచిన బియ్యంలో పురుగులు కనిపించలేదని ఈ విషయంపై విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థుల ఆరోగ్యం పై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలియజేశారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించేందుకు ప్రభుత్వం సన్న బియ్యం సరఫరా చేస్తున్నారు.
ఈ కార్యక్రమంలో వామన్ పల్లి సర్పంచ్ పర్ణిక కృపాకర్ రెడ్డి   పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333