విద్యార్థులకు సమగ్ర ఆరోగ్య పరీక్షలు
జోగులాంబ గద్వాల 25 సెప్టెంబర్ 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి : గుంటిపల్లి పాఠశాలలో 100 మంది విద్యార్థులకు వైద్య పరీక్షలు. జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ ఆదేశాల మేరకు, DMHO- డా. సంధ్యా కిరణ్మయి. ఆధ్వర్యంలో ఆరోగ్య పాఠశాల కార్యక్రమంలో భాగంగ గద్వాల్ మండలం గుంటిపల్లి గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థులకు సమగ్ర ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. ఉప్పేరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చెందిన వైద్యాధికారి డా. పి. రవికుమార్ విద్యార్థులకు రక్త పరీక్షలు, కంటి పరీక్షలు నిర్వహించారు. మొత్తం 100 మంది విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించగ, హిమోగ్లోబిన్ స్థాయిలు తక్కువగ ఉన్న విద్యార్థులకు అవసరమైన మాత్రలు అందజేశారు. విద్యార్థులు పౌష్టికాహారం తీసుకోవాలని, వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలని వైద్య సిబ్బంది సూచించారు. అలాగే చేతులు శుభ్రంగ కడుక్కోవడం, హ్యాండ్‌వాష్ ప్రాముఖ్యతపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఆరోగ్య సమస్యలు ఉన్న విద్యార్థులను గుర్తించి అవసరమైన తదుపరి వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటామని వైద్య సిబ్బంది తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి.ఎన్. కృపయ్య, గ్రామ సర్పంచ్ శివకుమార్, ఉపాధ్యాయులు, ANMలు, ఆశా కార్యకర్తలు మరియు ఇతర ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.