విధి నిర్వహణలో మృతి చెందిన పోలీసు కుటుంబానికి అండగా జిల్లా ఎస్పీ

Sep 25, 2026 - 19:37
 0  1
విధి నిర్వహణలో మృతి చెందిన పోలీసు కుటుంబానికి అండగా జిల్లా ఎస్పీ

  కుటుంబ సభ్యులకు కార్పస్ ఫండ్ చెక్కులు అందజేసిన జిల్లా ఎస్పీ – సంక్షేమ ప్రయోజనాలు సకాలంలో అందేలా చర్యలు

 జోగులాంబ గద్వాల 25 సెప్టెంబర్ 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి : హార్ట్ స్ట్రోక్ కారణంగా తేది.22.12.2020 న మృతి చెందిన హెడ్ కానిస్టేబుల్ శ్యామప్ప కుటుంబ సభ్యులకు కార్పస్ ఫండ్ కింద జిల్లా ఎస్పీ శ్రీ టి. శ్రీనివాస రావు, ఐపీఎస్.,  శుక్రవారం చెక్కులను అందజేశారు. శ్యామప్ప కుటుంబానికి కార్పస్ ఫండ్ ద్వారా అందాల్సిన ఆర్థిక సహాయంలో భాగంగా, గత నెలలో రెండో భార్య మనోర, కుమారుడు తేజ లకు ఒక్కొక్కరికి రూ.12,450/- చొప్పున రెండు చెక్కులు అందజేయగా, ప్రస్తుతం మొదటి భార్య కుమారుడు పి.కె. శ్రీకర్ మరియు శ్యామప్ప తల్లి నాగమ్మలకు జిల్లా ఎస్పీ గారు ఒక్కొక్కరికి రూ.12,450/- చొప్పున చెక్కులను అందజేశారు. కుటుంబ సభ్యులకు కార్పస్ ఫండ్ కింద అందించిన నాలుగు చెక్కుల మొత్తం రూ.48,000/-. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ  మాట్లాడుతూ, పోలీస్ శాఖలో విధులు నిర్వహిస్తూ మృతి చెందిన సిబ్బంది కుటుంబాల సంక్షేమానికి పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. మృతిచెందిన పోలీసు సిబ్బంది కుటుంబాలకు ప్రభుత్వం, పోలీస్ శాఖ ద్వారా అందాల్సిన సంక్షేమ ప్రయోజనాలు సకాలంలో అందేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని పేర్కొన్నారు. కుటుంబ సభ్యుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని వారికి అందాల్సిన మిగిలిన ప్రయోజనాలు కూడా త్వరితగతిన అందేలా సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుని చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు. పోలీస్ సిబ్బంది కుటుంబాల సంక్షేమం పట్ల పోలీస్ శాఖ నిరంతరం బాధ్యతతో వ్యవహరిస్తుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పోలీస్ కార్యాలయ ఏవో సాయి కృష్ణ, కార్యాలయ సూపర్డెంట్ నాగమణి, జూనియర్ అసిటెంట్ గాయత్రీ,  శ్యామప్ప కుటుంబ సభ్యులు పి.కె. శ్రీకర్, నాగమ్మ తదితరులు పాల్గొన్నారు.

.... .

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333