విద్యతోనే ఏదైనా సాధ్యం.

పటేల్ రమేష్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్

Jul 9, 2026 - 16:22
Jul 9, 2026 - 16:23
 0  1
విద్యతోనే ఏదైనా సాధ్యం.
విద్యతోనే ఏదైనా సాధ్యం.
విద్యతోనే ఏదైనా సాధ్యం.

ప్రభుత్వ విద్య బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుంది.

పటేల్ రమేష్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్. 

సూర్యాపేట, 09 జూలై 2026 తెలంగాణవార్త రిపోర్టర్:- విద్యతోనే ఏదైనా సాధ్యమని విద్యార్థులు కష్టపడి చదివి తామనుకున్న లక్ష్యాలను చేరుకోవాలని తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని జెడ్పి బాలుర హైస్కూల్లో సూర్యాపేట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు, 48 వ వార్డు కౌన్సిలర్ వెలుగు వెంకన్న ఆర్థిక సహకారంతో పాఠశాలకు ఫ్యాన్లు, ట్యూబ్ లైట్లు అందజేసే కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ విద్యను బలోపేతం చేసేలా  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు. రాష్ట్రంలోని గురుకులాల్లో, వసతి గృహాల్లో నాణ్యమైన విద్యతోపాటు విద్యార్థులకు బలమైన పౌష్టికాహారాన్ని అందజేస్తుందన్నారు. రాష్ట్రంలో ఇంటిగ్రేటెడ్ పాఠశాలలను ఏర్పాటు చేసి విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తుందని వివరించారు. విద్యార్థులు బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకొని జిల్లాకు రాష్ట్రస్థాయిలో గుర్తింపు తేవాలన్నారు.   ప్రపంచం అనేది ఒక గ్లోబల్ విలేజ్ గా మారిందని అవకాశాలను ఉపయోగించుకొని అద్భుతాలు సృష్టించాలన్నారు. ఇప్పటికే స్ప్రెడ్ ఇండియా సహకారంతో పాఠశాలల్లో విద్యార్థులకు కావలసిన అన్ని రకాల అవసరాలను తీర్చేలా సహకరిస్తున్నామని గుర్తు చేశారు.  ప్రస్తుతం పాఠశాలకు అవసరమైన డిజిటల్ బోర్డులు, ఎలక్ట్రికల్ బెల్ తో పాటు అవసరమైన సహకారం తప్పకుండా అందిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు వెలుగు వెంకన్న, వల్లాస్ దేవేందర్, పిల్లల రమేష్ నాయుడు, తండు శ్రీనివాస్ గౌడ్, అరవింద్ రెడ్డి, కర్ణాకర్ రెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు గోలి పద్మ ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333