విజయానికి అడ్డదారులు ఉండవు.. విజయానికి శ్రమయే మార్గము.

Mar 25, 2026 - 16:21
 0  0
విజయానికి అడ్డదారులు ఉండవు.. విజయానికి శ్రమయే మార్గము.
విజయానికి అడ్డదారులు ఉండవు.. విజయానికి శ్రమయే మార్గము.
విజయానికి అడ్డదారులు ఉండవు.. విజయానికి శ్రమయే మార్గము.

- సక్సెస్ సాధించాలంటే శ్రమ పడాలి.
- మంచి ప్రణాళికతో ముందుకు వెళ్లాలి.
- ఎంచుకున్న లక్ష్యం పై విషయ పరిజ్ఞానం సాధించాలి.
- గొప్ప విజయాలు సాదించిన వారి జీవితాలను ఆదర్శంగా తీసుకోవాలి.
- యువత మంచి భవిష్యత్తుకై కళలు కనాలి, సాధించాలి.
.... కె.నరసింహ ఐపిఎస్, ఎస్పి సూర్యాపేట జిల్లా.

సూర్యాపేట పట్టణం స్పందన డిగ్రీ మరియు పీజీ కళాశాల వార్షికోత్సవం సందర్భంగా కళాశాల యజమాన్యం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ నర్సింహా ఐపీఎస్ గారు ముఖ్యఅతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. విజయానికి అడ్డదారులు ఉండవని విజయం సాధించాలంటే శ్రమ మార్గమని, విద్యార్థులు నిత్యం శ్రమించాలని అన్నారు. ఎంచుకున్న లక్ష్యం సాధించడానికి మంచి ప్రణాళికతో ముందుకు వెళ్లాలని అంశాలపై విషయ పరిజ్ఞానం కలిగి ఉండాలని సూచించారు. గొప్ప విజయాలు సాధించిన వారి విజయగాతలను ఆదర్శంగా తీసుకోవాలని అబ్దుల్ కలాం గారి జీవితాన్ని ఉద్దేశించి వివరించారు. మంచి భవిష్యత్తుపై యువత కలలు కలనాలని ఆ కలలను సాకారం చేయడంలో నిరంతరం శ్రమించాలని సూచించారు. కష్టపడి చదువుకునే సమయంలో యువత ఆకర్షణలకు గురై బంగారు భవిష్యత్తును కోల్పోవద్దు,  చెడు అలవాట్లకు లోనూ కావద్దు అని కోరారు. శ్రమతో వచ్చే ఫలితం తృప్తినిస్తుంది, మంచి భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉన్నది అన్నారు.
సైరైన సమయంలో కష్టపడే వారు ఉన్నత స్థానాలకు చేరుతారు, సరైన సమయంలో కష్టపడని వారు వెనుకాపడుతారు. యువత శ్రమించడానికి ఎల్లప్పుడూ సిద్దంగా ఉండాలి అని కోరారు.

సమాజంలో ఉన్న సామాజిక అంశాల పట్ల, సామాజిక రుగ్మతల పట్ల యువత, విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలి అని సూచించారు. రోడ్డు భద్రత అరైవ్ అలైవ్ ఉద్దేశ్యాన్ని విద్యార్థులకు వివరించారు. ముఖ్యమైన సమస్యలు ఉన్నాయని రోడ్డు ప్రమాదాల బారిన పడి చాలా మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్నారు, యువత దేశాభివృద్ధికి ఉపయోగపడే వనరు, ప్రయాణ సమయంలో జాగ్రత్తలు పాటించాలి, వాహనాలు నడిపేటప్పుడు నెమ్మదిగా వెళ్ళాలి, హెల్మెట్ ధరించాలి, రోడ్డు పై ఉన్న చుట్టూ పరిస్థితులు గమనించి సురక్షిత గమ్యం చేరాలి. డిఫెన్సివ్ గా వాహనాలు నడపాలి అన్నారు. 60 శాతం ప్రమాదాలు ద్విచక్రవహనాల వల్ల సంభవిస్తున్నట్లు గణాంకాలు తెలుపుతున్నాయి. మత్తు పదార్థాలు యువతను, విద్యార్థులను చిదిమెస్తున్నాయి, చిన్న పాటి ఆనందం కోసం మత్తుకు, చెడు అలవాట్లకు అలవాటుపడి వ్యసన పరులుగా మారుతున్నారు. ప్రజల్లో ఉన్న అత్యాశ వల్ల సైబర్ మోసాలు జరుగుతున్నాయి, కష్టం లేకుండా కూర్చుని డబ్బు సంపాదించాలి అనుకుంటే సమస్యలు వస్తాయి. సామాజిక అంశాలు రోడ్డు భద్రత ప్రమాదాల నివారణ, డ్రగ్స్ నిర్మూలన, సైబర్ మోసాల నివారణలో యువత, విద్యార్థులు ఆదర్శంగా ఉండాలని కోరారు.


ఈ కార్యక్రమంలో కళాశాల యాజమాన్యం కరస్పాండెంట్ శ్రీనివాస్ రెడ్డి, ప్రిన్సిపాల్ సైదారావు, వాసుదేవరావు, వేణుగోపాల్, నాగిరెడ్డి, మారం వెంకట్ రెడ్డి, యాదవరెడ్డి, సత్యం బాబు, భగవాన్ రెడ్డి, విద్యార్థులు, ఉపాద్యాయులు ఉన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333