వికలాంగుల సంక్షేమన్ని పట్టించుకోలేని బీజేపీని పార్లమెంట్ ఎన్నికల్లో ఓడించాలి!

భువనగిరి 09 మే 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- భువనగిరి నియోజకవర్గంలో సిపిఎంకు మద్దతు,మిగతా16 నియోజకవర్గలలో ఇండియా కూటమి(కాంగ్రెస్)కి మద్దతు యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ ఎన్ పి ఆర్ డి జిల్లా ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్ వికలాంగుల సంక్షేమoను పట్టించుకోని బీజేపీ అభ్యర్థులను పార్లమెంట్ ఎన్నికల్లో ఓడించాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ పిలుపునిస్తుంది.దేశంలో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తరువాత వికలాంగులు పోరాడి సాధించుకున్న అనేక చట్టాలను రద్దు చేయాలని కుట్రలు చేస్తుంది.బీజేపీ పాలిత రాష్ట్రాల్లో వికలాంగులపై దాడులు, మహిళలపై లైంగిక వేధింపులు, అత్యాచారాలు పెరిగిపోతున్నాయి వాటిని అరికట్టడంలో కేంద్ర ప్రభుత్వం విఫలం చెందింది.కేంద్ర ప్రభుత్వం 2011నుండి వికలాంగులకు 300 రూపాయలే పెన్షన్ ఇస్తుండి.ధరల పెరుగుదలకు అనుగుణంగా వికలాంగుల పెన్షన్ 5000లకు పెంచడం లేదు.కరోనా సమయంలో 1000రూపాయల ఎక్సీగ్రేషియా ఇస్తామని చెప్పి కేవలం 10 లక్షల మందికే ఇచ్చి చేతులు దులుపుకుంది.
ఇప్పటికి 2016 ఆర్ పి డి చట్టానికి కమిషనర్ ను నియమించలేదు. నేషనల్ ట్రస్ట్ కు చైర్మన్ నియమించలేదు.9 నేషనల్ ఇన్స్టిట్యూట్ ను 4 సంస్థలుగా విలీనం చేయాలనీ నిర్ణయం చేసింది.నేషనల్ ఇన్స్టిట్యూట్స్ లలో కొత్త నియమాలు చేయడం లేదు. 2016 ఆర్ సి డబ్ల్యూడి చట్టంలోని సెక్షన్ 89,92,93లను రద్దు చేయాలనీ నిర్ణయం చేస్తే ఎన్ పి ఆర్ డి పోరాటాల ఫలితంగా వలన వెనక్కి తగ్గింది.కేంద్ర ప్రభుత్వ సర్వీస్ ఉద్యోగ నియామకాల్లో వికలాంగులకు మినహాయింపు చేయాలనీ నిర్ణయం చేస్తే కోర్ట్ తీర్పు తో వెనక్కి తగ్గింది. ఎంపీ నిధులలో వికలాంగులకు కేటాయించిన నిధులు ఖర్చు చేయలేదు. కేంద్ర ప్రభుత్వ రంగా సంస్థల్లో ఖాళీగా ఉన్న వికలాంగుల బ్యాక్ లాక్ పోస్టులు భర్తీ చేయడం లేదు.
రైల్వేలో రాయితీ పాసులు రద్దు చేయడానికి కుట్రలు చేస్తుంది. దేశ వ్యాపితంగా జిల్లా కేంద్రాల్లో మానసిక వికలాంగులకు హోమ్స్ నిర్మించాలని 2017 మెంటల్ హెల్త్ కేర్ చట్టంలో ఉంది. కానీ అమలు చేయలేదు హైదరాబాద్ నగరంలో ఉన్న ఆరంఘర్ లోని మానసిక వికలాంగుల కేంద్రం ఎత్తివేతకు ప్రయత్నం.2016 ఆర్ పి డబ్ల్యూడి 2017 మానసిక వికలాంగుల చట్టం, నేషనల్ ట్రస్ట్, నేషనల్ పాలసి వంటి చట్టాలు అమలు పట్ల పర్యవేక్షణ లేదు, తీవ్ర వైకల్యం కలిగిన వికలాంగులు, వారి సహాయకులకు ప్రత్యేక అలవెన్స్ ఇవ్వాలని చట్టంలో ఎందుకు అమలు చేయడం లేదు.ఇండియా కూటమి కేంద్రంలో అధికారంలోకి వస్తే వికలాంగులపై వివక్ష తొలగించడానికి రాజ్యాంగంలోని ఆర్టికల్ 15,16ను సవరించడం జరుగుతుంది.స్థానిక సంస్థలలో వికలాంగులకు రిజర్వేషన్లుఅమలుచేయడం జరుగుతుంది.బ్రెయిలీ స్క్రిప్ట్, సైన్ లాంగ్వేజ్ లను అధికారిక బాషాలు గా గుర్తించి వాటి అభివృద్ధి కోసం చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
వికలాంగుల హక్కుల చట్టం 2016 ను సంపూర్ణంగా అన్ని రాష్ట్రాల్లో అమలు చేయడానికి అవసరమైన చర్యలుతీసుకోవడం,ప్రైవేటు, ప్రభుత్వం భాగస్వామ్యంతో వికలాంగులకు సామాజిక భద్రత & సంరక్షణ కోసం ప్రత్యేక పథకాలు రూపొందించడం జరుగుతుంది. అంగ వైకల్యం ఉన్న విద్యార్ధులకి మెరుగైన విద్యను,ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలకి చదువు చెప్పేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో సిపిఎం అభ్యర్తి జహంగీర్ ను గెలిపించాలని ఎన్ పి ఆర్ డి యాదాద్రి భువనగిరి కమిటీ విజ్ఞప్తి చేస్తుంది.స్వరూపంగా ప్రకాష్ జిల్లా అధ్యక్షులు వనం ఉపేందర్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్త లలిత జిల్లా మహిళా కన్వీనర్, తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.