వాహనదారులకు ట్రాఫిక్ నియామ నిబంధనలను సూచిస్తున్న ఎస్ఐ సాయిరాం

వాహనదారులందరూ విధిగా ట్రాఫిక్ నియమాలు పాటించాలని సూర్యాపేట పట్టణ ట్రాఫిక్ ఎస్ఐ సాయిరాం తెలిపారు. స్థానిక బస్టాండ్ జంక్షన్ వద్ద వాహనదారులకు ట్రాఫిక్ అవేర్నెస్ కార్యక్రమం నిర్వహించారు. అధిక సంఖ్యలో ప్రయాణికులను ఎక్కించుకున్నా, వేగంగా నడిపినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వాహనదారులు లైసెన్సులు లేకుండా వాహనాలు నడిపితే కేసులు నమోదు చేస్తామన్నారు.వాహనదారు లు తప్పనిసరిగా ట్రాఫిక్ రూల్స్ పాటించాలని, నిబంధ నలు అతిక్రమించ రాదని, సురక్షితంగా గమ్యస్థానాలకు చేరాలని సూచించారు. వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ రోడ్డు నిబంధనలను, ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ పోలీస్ శాఖ వారికి సహకరించాలని కోరారు. వాహనాల నెంబర్లను టాంపరింగ్ చేయడం,ట్రిపుల్ రైడింగ్, వాహనాలకు అదనపు సైలెన్సర్లను బిగించి శబ్ద కాలుష్యానికి కారణమవుతున్న వాహనాలపై దృష్టి సారించి చర్యలు తీసుకుంటామని అన్నారు.