వరి పంటల పై డ్రోన్ తో మందుల పిచికారి పై అవగాహన.

Sep 19, 2024 - 19:41
Sep 19, 2024 - 20:21
 0  9
వరి పంటల పై డ్రోన్ తో మందుల పిచికారి పై అవగాహన.

తెలంగాణ వార్త ఆత్మకూరుయస్  వరి పంటల పై డ్రోన్ తో మందుల పిచికారి పై అవగాహన. ఆత్మకూర్... మారుతున్న వాతావరణం, నూతన సాంకేతిక పరిస్థితులకు అనుగుణంగా వరిలో డ్రోన్ ను ఉపయోగించి తక్కువ సమయంలో ఎక్కువ మొత్తంలో మందులు పిచికారి చేసుకోవచ్చని, డ్రోన్ పిచికారి ద్వారా సమయం మందు ఆదా అవు తుందని కెవికె గడ్డిపల్లి శాస్త్రవేత్తలు ఎ నరేష్, కిరణ్ లు అన్నారు.గురువారం మండల పరిధిలోని గట్టికల్లు గ్రామంలో భారతీయ వరి పరిశోధన సంస్థ- హైదరబాద్ & ఎస్బీఐ, ఫౌండేషన్ సీఎస్ఆర్ సహకారంతో నేరుగా విత్తే వరిసాగు-యాజమాన్య పద్ధతులు, డ్రోన్ తో మందుల పిచికారి పై శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా శాస్త్రవేత్తలు మాట్లాడుతూ నేరుగా విత్తే వరిసాగు అయిన వరిలో డ్రం సీడర్ లేదా వేదజల్లె పద్దతిలో నేరుగా వరి వలన కూలీల ఖర్చును ఆదా చేయవచ్చు అన్నారు. వాతావరణంలో వస్తున్న మార్పుల మూలంగా వర్షాలు సకాలంలో కురవక, నార్లు పోయడం మరియు నాట్లు వేయడం ఆలస్యం అవడం వల్ల వరి దిగుబడులు తగ్గుతున్నాయి అన్నారు. అదేవిధంగా కలుపు యజమాన్యం, నీటి మరియు ఎరువుల యజమాన్యం పై అవగాహణ కల్పించారు. తర్వాత వరి పంటలలో డ్రోన్ పిచికారీ పై అవగాహన కల్పించారు మరియు చీడపీడల యాజమాన్య పద్ధతులు రైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో కే.వి.కే- గడ్డిపల్లి ప్రోగ్రాం కంప్యూటర్ ఎ.నరేష్ రైతులు ఎన్.లింగయ్య, కె.నాగరాజు, కె.వీర శంకర్ కె.అయోధ్య రాములు, మహేష్ ,గోవర్ధన్ మరియు వ్యవసాయ విద్యార్థులు ఎ. భరత్ రెడ్డి ఎన్. దత్త సాయి, టీ. జాన్ ,ఒ. రఘుపతి రెడ్డి ,వి. వేణు, జహీర్ తదితరలు పాల్గొన్నారు