లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయం ఏఐసీసీ కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్.

జోగులాంబ గద్వాల 2 మార్చి 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:- గద్వాల. రానున్న లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపునకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందేలా చూడాలని ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ అన్నారు. ఈరోజు ఆయన మాట్లాడుతూ ఎంపీ ఎన్నికల నేపథ్యంలో ప్రజా పాలన విజయోత్సవాన్ని నిర్వహించాలన్నారు. ఈ నెల 6 నుంచి అలంపూర్ నుంచి అచ్చంపేట వరకు పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు.