లవారి సమీక్ష సమావేశం డాక్టర్ రాధిక
జోగులాంబ గద్వాల 7మే 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి : ఇటిక్యాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు డాక్టర్ రాధిక ఆధ్వర్యంమీటింగ్ సూపర్వైజర్స్, MLHPs, ANMs, మరియు ఆశా సమావేశానికి హాజరై
ఈ సందర్భంగా డాక్టర్ రాధిక మాట్లాడుతూ....
ముఖ్యంగా నెలవారి సమీక్ష సమావేశం జరిగినది మరియు మే రెండవ తేదీ నుంచి జూన్ 12వ తేదీ వరకు స్నేహ మీటింగ్ ప్రతి గ్రామ పంచాయతీ వారంలో ప్రతి మంగళవారం ప్రతి శుక్రవారం జరుగుచున్నవి ఈ మీటింగులో 15 సంవత్సరముల నుండి 18 సంవత్సరాల లోపు బాలికలను గుర్తించి వారికి ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నచో మరియు రక్తహీనత, 18 సంవత్సరాల లోపు బాల్య వివాహాలు ఏమైనా జరిగినచో మరియు వారిపై ఏమైనా లైంగిక వేధింపులు ఇతర సమస్యలు ఉన్నచో 1098 కాల్ చేయవలెను అప్పుడు వారికి తగిన న్యాయం చేయబడును అదేవిధంగా గ్రామపంచాయతీ లో పంచాయతీ సెక్రెటరీ, బుక్ కీపర్, అంగన్వాడీ కార్యకర్త,, ఏఎన్ ఎం , ఆశా కార్యకర్తలు అందరూ పాల్గొని వారికి ఆరోగ్య విద్యను బోధిస్తారు మరియు 11 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలలోపు కిశోర బాలికలకు కూడా ఆరోగ్య విద్యను బోధిస్తారు, వారికి ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నచో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మనకు తీసుకొని చికిత్స చేయిస్తారు మరి యు గ్రామంలో ని గర్భిణీ స్త్రీలను బాలింతలను గుర్తించి వారికి సేవలను అంద చేస్తారు మరియు ఎండాకాలంలో వచ్చే ఎండ తీవ్రత ను గురించి వారికి వివరించడం జరిగింది ఈ విధంగా అన్ని ఆరోగ్య కార్యక్రమాలపై సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది ఉన్నారు.