నూతన న్యూట్రిషన్ సెంటర్ ప్రారంభోత్సవం
తిరుమలగిరి 16 జూలై 2026 తెలంగాణ వార్త రిపోర్టర్ :- సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండల కేంద్రం లో నూతనంగా హెర్బలైఫ్ కు సంబందించిన న్యూట్రషన్ సెంటర్ ను ప్రారంభించడం జరిగింది ఈటూరు గ్రామానికి చెందిన జక్కుల సందీప్ గత సంవత్సరం ల నుండి హెర్బలైఫ్ సంస్థ లొ ఒక అసోసియేట్ గా ఉంటూ ఈ సెంటర్ ను ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శరీరానికి అవసరమైన శక్తిని అందించి, వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. దీనిలో పిండి పదార్థాలు (కార్బోహైడ్రేట్లు), ప్రొటీన్లు, కొవ్వులు వంటి స్థూల పోషకాలు, విటమిన్లు, ఖనిజాలు వంటి సూక్ష్మ పోషకాలు ఉంటాయి. వ్యాధుల బారిన పడకుండా ఆరోగ్యంగా జీవించవచ్చు.పోషకాహారం గురించిన పూర్తి వివరాలు మరియు మీ శరీరానికి అవసరమైన పోషక విలువల గురించి మరింత సమాచారం కోసం - న్యూట్రిషన్ ను సంప్రదించాలి అన్నారు ఈ కార్యక్రమం లొ తిరుమలగిరి సి ఎస్ ఐ చర్చ్ Rev జయరాజ్ మరియు పనిగిరి పాస్టరెట్ అబ్రాహాము పాస్టరట్ గ్రూప్ సభ్యులు హెర్బలైఫ్ కు సంబందించిన టీమ్ మెంబెర్స్ బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు