లక్ష్యానికి చేరువలో  సూర్యాపేట జిల్లాలో  సర్ ప్రక్రియ 

Jul 25, 2026 - 00:48
Jul 25, 2026 - 00:57
 0  3
లక్ష్యానికి చేరువలో  సూర్యాపేట జిల్లాలో  సర్ ప్రక్రియ 

కలెక్టర్ తేజస్ నిరంతర పర్యవేక్షణ- జిల్లావ్యాప్తంగా ఆకస్మిక తనిఖీలు 

జిల్లాలో ఇప్పటివరకు డిజిటలైజేషన్ ప్రక్రియ వందకు వందశాతం కు గాను 92. 69% పూర్తి కాగా 7.31 శాతం మాత్రమే పెండింగ్

సూర్యాపేట, 25 జూలై 2026 తెలంగాణవార్త రిపోర్టర్:- సూర్యాపేట జిల్లాలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ప్రక్రియ ముమ్మరంగా  కొనసాగుతూ 100% లక్ష్యానికి చెరువలో ఉంది. సూర్యాపేట జిల్లాలో సర్ ప్రక్రియ సజావుగా కొనసాగటానికి సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవా ర్ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకుగాను ప్రతిరోజు జిల్లాలోని తహసీల్దారులు, ఇతర జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ లు, వెబ్ ఎక్స్ లు నిర్వహిస్తున్నారు. అధికారులే కాకుండా బిఎల్ఓ లను కూడా నిత్యం అప్రమత్తం చేస్తున్నారు. అంతేకాకుండా జిల్లా వ్యాప్తంగా ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించి సర్ ప్రక్రియ వేగవంతం కావడానికి జిల్లా కలెక్టర్ అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. నిత్యం పర్యటనలు, నిరంతర పర్యవేక్షణల ద్వారా సూర్యాపేట జిల్లా సర్ ప్రక్రియలో 100% లక్ష్యానికి త్వరలో చేరనుంది. రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు ధీటుగా సూర్యాపేట జిల్లాలో కూడా సర్ ప్రక్రియ వేగంగా దూసుకెళ్తూ 100%  లక్ష్యానికి మరో 7.31 శాతం దూరంలో ఉంది.

సూర్యాపేట జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లోనూ సర్ ప్రక్రియ ఇలా ఉంది 

హుజూర్నగర్ నియోజకవర్గము

సూర్యాపేట జిల్లాలోని హుజూర్నగర్ నియోజకవర్గంలో 311పోలింగ్ స్టేషన్లు ఉండగా 2,49,904 మంది ఓటర్లకు  ఫామ్ లు పంపిణీ చేయాల్సి ఉండగా 2,22,379 మంది ఓటర్లకు ఫాములు పంపిణీ చేసి డిజిటల్ 88.99 శాతం పూర్తి చేశారు. ఇంకా 19,256 ఫామ్ లను (7.71%) సేకరించాల్సి ఉంది.  హుజూర్నగర్ నియోజకవర్గంలో ఇప్పటివరకు మొత్తం 2,41,635 ఎలక్ట్రోరల్ ఫామ్ లను డిజిటలైజెడ్ (96.69 శాతం) చేయగా మరొక 8,269 ఎలక్ట్రోరల్ ఫామ్ లు (3.31 శాతం)  డిజిటల్ పెండింగ్లో ఉంది. 

కోదాడ నియోజకవర్గం 

కోదాడ నియోజకవర్గంలో మొత్తం 29 పోలింగ్ స్టేషన్ల కు గాను 2,48,175 ఓటర్లకు ఎలక్ట్రోరల్ ఫామ్ లకు  2,13,312 ఎలక్ట్రోరల్ ఫామ్ లు (85.85 శాతం) డిజిటలైజ్డ్ పూర్తయింది.  ఇంకా సేకరించని 15.974 ఫామ్ లు(6.44 %) ఉండగా, ఇప్పటివరకు మొత్తం 2,29,286 ఎలక్ట్రోరల్ ఫామ్ లు (92.93%) డిజిటలైజేషన్ పూర్తికాగా 7.61% ఎలక్ట్రోరల్ ఫామ్ లు మాత్రమే పెండింగ్లో ఉన్నాయి. 18,889 ఎలక్ట్రోరల్ ఫామ్ లు (7.61%) డిజిటలైజేషన్ పెండింగ్లో ఉంది.

సూర్యాపేట నియోజకవర్గం 

సూర్యాపేట నియోజకవర్గంలో 271 పోలింగ్ స్టేషన్లకు గాను 2,46,432 ఓటర్లకు కాను 2,05,805 ఎలక్ట్రోరల్ ఫామ్ లు 83.51% డిజిట లైజేషన్ ప్రక్రియ పూర్తయింది. ఇంకా సేకరించని 15,742 ( 6.39%) ఉండగా, 2,21,547 ఎలక్ట్రోరల్ ఫామ్ లు (89.90%) డిజిటలైజేషన్ పూర్తయింది. 24,885 ఎలక్ట్రోరల్ ఫామ్ లు (10.10%) డిజిటలైజేషన్  పెండింగ్లో ఉన్నాయి.

తుంగతుర్తి నియోజకవర్గం 

తుంగతుర్తి నియోజకవర్గం లోని మొత్తం 327 పోలింగ్ స్టేషన్లో గాను 2,63,741 ఓటర్లకు గాను 2,28,162 ఎలక్ట్రోరల్ ఫామ్ లు (86.51%) డిజిటలైజేషన్ పూర్తయింది.  ఇంకా అన్ కలెక్టెడ్ 13,951 (5.29%) ఫామ్ లు ఉండగా, ఇప్పటివరకు మొత్తం 2,42,113 ఎలక్ట్రోరల్ ఫామ్ లు, (91.80%) డిజిటలైజేషన్ పూర్తయింది. 21,628 ఎలక్ట్రోరల్ ఫామ్ లు (8.20%,)డిజిటలైజేషన్ పెండింగ్లో ఉంది.

జిల్లా మొత్తం సర్ ప్రక్రియ పరిస్థితి ఇలా ఉంది

సూర్యాపేట జిల్లాలో మొత్తం 1205 పోలింగ్ స్టేషన్లకు గాను 10,08,252 ఓటర్లు ఉండగా 8,69,658 ఎలక్ట్రోరల్ ఫామ్ లు (86.25%) డిజిటలైజేషన్ పూర్తయింది. ఇంకా పెండింగ్లో 64,923 (6.44%) అన్ కలెక్టెడ్ ఎలక్ట్రోరల్ ఫామ్ లు ఉన్నాయి. అయితే మొత్తం జిల్లా వారిగా డిజిటలైజేషన్ పూర్తయిన సంఖ్య 9,34,581 ఎలక్ట్రోరల్ ఫామ్ లు (92.69%) గా ఉంది. మరొక పెండింగ్లో ఉన్న 73,671 ఎలక్ట్రోరల్ ఫామ్ లు అంటే (7.31%) డిజిటలైజేషన్ పెండింగ్ ఉన్నాయి. అయితే ఈ గణాంకాలను విశ్లేషిస్తే జిల్లా వ్యాప్తంగా 92.69 శాతం సర్ ప్రక్రియ పూర్తి కాగా కేవలం 7.31% సర్ ప్రక్రియ పెండింగ్లో ఉందని చెప్పవచ్చు. అంతేకాకుండా జిల్లాలో వందకు వందశాతం  సర్ ప్రక్రియను పూర్తిచేసిన పోలింగ్ స్టేషన్ లు  కూడా ఉండటం విశేషం.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333