రోడ్లు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలి ఆర్ అండ్ బి అధికారులకు"" మంత్రి తుమ్మల ఆదేశం

శర రవేగంగా కోదాడ క్రాస్ రోడ్డు నుండి కరుణగిరి రోడ్డు డివైడర్ల మరమ్మత్తు పనులు* •శ్రీ రామనవమిలోగా పూర్తి చేయాలి
ఆహ్లాదకర వాతావరణం ఉట్టిపడాలి
రోడ్డు ప్రమాదాల నివారణ కు చర్యలు తీసుకోవాలి
ఆర్ అండ్ బి అధికారులకు మంత్రి తుమ్మల ఆదేశం
ఖమ్మం రూరల్ 6 మార్చి 2025 తెలంగాణవార్త ప్రతినిధి:- ఖమ్మం రూరల్ మండలంలోని కోదాడ క్రాస్ రోడ్డు నుండి కరుణగిరి రోడ్డు వరకు రోడ్డు, డివైడర్లు చాలా వరకు దెబ్బతిన్నాయని, వాటి మరమ్మత్తు పనులను శ్రీరామనవమి లోపు పూర్తిచేయాలని ఆర్ అండ్ బి అధికారులను వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. మంత్రి తుమ్మల ఆదేశాలకనుగుణంగా రహదారులు, సర్కిళ్లు, డివైడర్ల రిపేర్ పనులు మొదలయ్యాయి. పూర్తయిన డివైడర్లు, సర్కిళ్లలో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేసేలా, మొక్కలు నాటేలా, పెయిటింగ్ చేసేలా చర్యలు తీసుకోవాలని ఎదులాపూర్ మున్సిపల్ కమిషనర్, ఖమ్మం కలెక్టర్ ను మంత్రి తుమ్మల ఆదేశించారు. అలాగే ఖమ్మం బ్యూటిఫికేషన్ మరియు ఎదులాపురం మున్సిపాలిటి బ్యూటిఫికేషన్ కోసం ప్రణాళికలు సిద్ధం చేయాలని హైదరాబాద్ సిటి బ్యుటిఫికేషన్ ఇంఛార్జి కృష్ణ, IFS ని కోరడం జరిగింది. శ్రీ రామనవమి వరకు ఖమ్మం నుంచి భద్రాచలం వెళ్లే రోడ్డు మరియు ఖమ్మం పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్ది, భక్తులకు మరియు వాహనదారులకు ఆహ్లాద వాతావరణాన్ని కల్పించాలన్నారు. ఆధునిక హంగులతో డివైడర్లను సుందరీకరించాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని మంత్రి తుమ్మల ఆదేశించారు.