రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా రక్తదాన శిబిరం 

Jan 22, 2025 - 20:10
 0  4
రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా రక్తదాన శిబిరం 
రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా రక్తదాన శిబిరం 

జోగులాంబ గద్వాల 22 జనవరి 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి: గద్వాల రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని జిల్లా రవాణాశాఖ కార్యాలయం దగ్గర బుధవారం రక్తదాన శిబిరాన్ని జిల్లా రవాణా అధికారి కృష్ణారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రక్తం ను ఇస్తే ప్రాణం దానం చేసినట్లు అవుతుందని తెలిపారు.ప్రతి ఒక్కరూ జీవిత కాలంలో రక్తదానం చేస్తే వారికి మరింత ఆరోగ్యం కలుగుతుందన్నారు.ఈ సందర్భంగా పలువురు యువకులు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఏ ఎంవిఐలు రాములు నాయక్, పవన్ కుమార్, పీఆర్వో రాకేష్, ల్యాబ్ టెక్నీషియన్ వెంకటేస్వర్ రెడ్డి, సీనియర్ అసిస్టెంట్ రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జర్నలిస్ట్ కొంకల సుదర్శన్ గౌడ్ రక్తదానం చేశారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333