రోడ్డు భద్రతా నియమాలు పాటించాలి 

May 12, 2025 - 19:24
 0  5
రోడ్డు భద్రతా నియమాలు పాటించాలి 
రోడ్డు భద్రతా నియమాలు పాటించాలి 
రోడ్డు భద్రతా నియమాలు పాటించాలి 
రోడ్డు భద్రతా నియమాలు పాటించాలి 
రోడ్డు భద్రతా నియమాలు పాటించాలి 

సూర్యాపేట జిల్లా  ఎస్పి కె నరసింహ IPS గారి ఆదేశాల మేరకు మద్దిరాల SI వీరన్న గారు మండల కేంద్రంలో పోలీస్ కళబృందం చేత పోలీస్ ప్రజా భరోసా విధానాలు,రోడ్డు ప్రమాదాలు, సైబర్ నేరాలు, మహిళల భద్రత పై అవగాహన
- ఒకసారి మైనర్ డ్రైవింగ్ కేసు 
నమోదైతే 25 సం.రాల వరకు డ్రైవింగ్ లైసెన్స్ రాదు.
- మైనర్ డ్రైవింగ్ కు గరిష్ఠంగా 25 వేల రూపాయల జరిమానా.
- మైనర్స్ కు వాహనాలు ఇవ్వొద్దు.
- కొత్త నిభందనలు మేరకు కఠిన చర్యలు ఉంటాయి.
- 25 ఏళ్ల వరకు నో డ్రైవింగ్‌ లైసెన్స్‌.. 
- డ్రైవింగ్ చేస్తూ మైనర్లు దొరికారంటే జరిగేది ఇదే. 
- SI వీరన్న మాట్లాడుతూ
  పిల్లలకు వాహనాలు ఇవ్వడం ప్రమాదం అని, రోడ్డు నిభందనలు, మోటారువాహన చట్టం ప్రకారం మైనర్స్ వాహనాలు నడపడం నిషేదం అని, మైనర్స్ డ్రైవింగ్ చేస్తూ ఒకసారి పట్టుబడితే వారికి 25 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వడం కుదరదు అని తెలిపినారు. రోడ్డు భద్రత ప్రమాదాల నివారణలో భాగంగా ప్రభుత్వాలు కఠిన చట్టాలను, నిబంధనలను రూపొందించాయి అన్నారు. ప్రభుత్వ నిబంధనలను పోలీసు శాఖ పటిష్టంగా అమలు చేస్తుంది అన్నారు. కొత్త నిబంధనల ప్రకారం మైనర్ డ్రైవింగ్ కు గరిష్ఠంగా 25 వేల రూపాయల వరకు జరిమానా ఉంటుందని, తల్లిదండ్రులను కూడా కోర్టులో హాజరు పరుస్తాం అన్నారు.  డ్రైవింగ్ చేస్తూ మైనర్స్ ఒకసారి పట్టుబడితే వారి వివరాలను రవాణా శాఖ వారికి పంపుతాం అని హెచ్చరించారు. మైనర్లు డ్రైవింగ్ చేస్తు దొరికితే తల్లిదండ్రులు లేదా వాహన యజమానులపై చర్యలు ఉంటాయని, లైసెన్స్‌ సీజ్ చేయడం, భారీగా జరిమానా విధించడం, జైలుకు పంపడం జరుగుతుందన్నారు. 25 ఏళ్ల వయసు వచ్చే వరకు మైనర్ డ్రైవింగ్ లైసెన్స్ పొందడానికి అవకాశం ఉండదు అన్నారు. 
రోడ్డు ప్రమాదాలను నివారించడానికి ప్రతిరోజూ వాహనాలు తనిఖీ చేస్తున్నామని, పట్టుబడ్డ మైనర్స్ కు కౌన్సిలింగ్ ఇస్తున్నామని, ఇకనుండి నూతన నిభందనలు ప్రకారం చర్యలు ఉంటాయన్నారు. కాబట్టి, మైనర్లకు వాహనాలు ఇవ్వకుండా, మైనర్ల డ్రైవింగ్‌ను ప్రోత్సహించకుండా తల్లిదండ్రులు, వాహన యజమానులు బాధ్యత వహించాలని సూచించారు.
ఈ కార్యక్రమం లో ASI సాలయ్య, కానిస్టేబుల్ కృష్ణ,మధు, సల్మాన్, మహిళ కానిస్టేబుల్ జరీనా, ప్రియాంక,HG బి . మల్సూర్, వెంకన్న మరియు  ప్రజానీకం పాల్గొన్నారు

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333