రోడ్డు ప్రమాదాల నివారణ కై అవగాహన సదస్సు

Mar 25, 2025 - 20:18
 0  8
రోడ్డు ప్రమాదాల నివారణ కై అవగాహన సదస్సు
రోడ్డు ప్రమాదాల నివారణ కై అవగాహన సదస్సు

మిర్యాలగూడ డి.ఎస్.పి రాజశేఖర్ రాజు 

తెలంగాణ వార్త మాడుగులపల్లి మార్చి 25 నల్గొండ జిల్లా మాడుగుల పల్లి మండలం చెరువుపల్లి గ్రామం నందు రాత్రి నల్లగొండ జిల్లా ఎస్పీ శ్రీ శరత్ చంద్ర పవర్ ఐపీఎస్  ఉత్తర్వుల మేరకు మిర్యాలగూడ సబ్ డివిజన్ పోలీస్ ఆఫీసర్ రాజశేఖర్ రాజు మరియు మిర్యాలగూడ రూరల్ సీఐ ఎన్ డి ప్రసాద్  ఆధ్వర్యంలో మాడుగుల పల్లి పోలీస్ వారు మాడుగుల పల్లి గ్రామంలోని చెరువుపల్లి రోడ్డులో రోడ్డు ప్రమాదాల నిర్మూలన లో భాగంగా నల్లగొండ జిల్లా కళాజాత బృందం వారిచే RRR కార్యక్రమం ను నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమాన్ని ఉద్దేశించి డిఎస్పీ  ప్రమాదాల నివారణకై ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, సైబర్ నేరాల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, గంజాయి వల్ల యువతకు జరిగే నష్టాల గురించి జిల్లా ఎస్పీ తలపెట్టిన మిషన్ పరివర్తన్ మిషన్ పరివర్తన యువతేజంకార్యక్రమాల గురించి ప్రజలకు వివరించడం జరిగినది. ఈ కార్యక్రమంలో మాడుగులపల్లి ఎస్సై కృష్ణయ్య మరియు పోలీస్ సిబ్బంది గ్రామ ప్రజలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333