రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మల్లీస్వామి కుటుంబానికి 50వేలు ఆర్థిక సహాయం చేసిన మంత్రి కోమటిరెడ్డి

Aug 5, 2026 - 00:41
Aug 5, 2026 - 00:43
 0  1
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మల్లీస్వామి కుటుంబానికి 50వేలు ఆర్థిక సహాయం చేసిన మంత్రి కోమటిరెడ్డి

అడ్డగూడూరు 4 ఆగస్టు 2026 తెలంగాణవార్త రిపోర్టర్:– ఆపద అంటే పార్టీలకు అతీతంగా కులాల కతీతంగా,మతాల కతీతంగా సహాయం చేసే గొప్ప ప్రజానాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని అడ్డగూడూరు మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు బైరెడ్డి సందీప్ రెడ్డి  అన్నారు.యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు పట్టణ కేంద్రనికి చెందిన బాలెంల మల్లీస్వామి ఇటీవల రోడ్డు ప్రమాదంలో చనిపోయిన విషయం యూత్ కాంగ్రెస్ అడ్డగూడూరు మండల అధ్యక్షుడు బైరెడ్డి సందీప్ రెడ్డి అడ్డగూడూరు కాంగ్రెస్ పార్టీ నాయకులు రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి తెలుపగా వారు వెంటనే వారి మాట కాదనకుండా వారి కుటుంబానికి 50వేల రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు.ఈ సందర్బంగా జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కడారి రమేష్,మాజీ ఎంపిటిసి  గూడెం పాండు యూత్ అధ్యక్షులు బైరెడ్డి సందీప్ రెడ్డి మాట్లాడుతూ..మేం ఏ రోజేనా ఆపద ఉందని మంత్రి వారి గడప తడితే,వారిది పేద కుటుంబం సార్ మీరు సహాయం చేసి ఆ కుటుంబానికి న్యాయం చేయాలి సార్ అని చెప్పగానే ఆపద అంటే పార్టీలకతీతంగా,కులాలకు అతీతంగా సహాయం చేసే గొప్ప నాయకుడు తెలంగాణ మంత్రి నల్గొండ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని అన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి కడారి రమేష్, ఎంపిటిసి గూడెపు పాండు, గోదల సోమన్న,జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మారిశెట్టి మల్లేష్, జిల్లా యువజన కాంగ్రెస్ నాయకులు పూలపెల్లి రాజశేఖర్ రెడ్డి, వార్డు సభ్యులు షేక్ సమీర్, కాంగ్రెస్ నాయకులు చుక్క యాదగిరి ఆసర్ల బీరుమల్లు, పరిగల సత్య నారాయణ, గండేలా రవి, తుప్పతి నరేష్, సకినాల బాలరాజ్, పరిగెల మహేష్, గండేలా హరీష్, కంచి మచ్చగిరి, తుప్పతి ఉపేందర్, కంచి నరేష్, కూతటి వెంకన్న, చిన్నo లక్ష్యయ్య, కందుకూరి లక్ష్మయ్య,బాలెoల సోమన్న,బోయపల్లి మధు, ఆసరా రమేష్,లోడంగి అనిల్, షేక్ సోహెల్, అలుగుబెల్లి సాయి రెడ్డి, అసర్ల పవన్, బాలెంల మహేష్,అధిక సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు, కోమటిరెడ్డి బ్రదర్స్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు.