రైతు ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యం ఎమ్మెల్యే

Jul 29, 2026 - 22:18
 0  2
రైతు ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యం ఎమ్మెల్యే
రైతు ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యం ఎమ్మెల్యే

గుడ్డెం దొడ్డి రిజర్వాయర్ పేస్ 1 నుంచి సాగునీరు విడుదల చేసిన ఎమ్మెల్యే.

ర్యాలంపాడు రిజర్వాయర్ ను ద్వారా నీటిని విడుదల చేసిన ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి.

 జోగులాంబ గద్వాల 29 జూలై 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి : ధరూర్. మండల పరిధిలోనీ  గుడ్డెందొడ్డి గ్రామ సమీపంలో  నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం పేస్-1 పంపూహౌస్ మరియు ర్యాలంపాడు రిజర్వాయర్ నీటిని విడుదల  కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పంప్ హౌస్ ను స్విచ్ ఆన్ చేసి సాగు నీటిని విడుదల చేశారు.అనంతరం గంగమ్మ కు పూజ చేసి నీటిని ప్రారంభించారు. జరిగినది.రిజర్వాయర్ నీటిని విడుదల చేసి  కాలువల ద్వారా  చెరువులు, కుంటలకు నీరు నింపి రైతులకు వ్యవసాయానికి  ఉపయోగించడానికి  సాగునీటిని విడుదల చేయడం జరిగినది.ఎమ్మెల్యే  మాట్లాడుతూ ప్రజలందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు నీళ్లు విడుదల చేయడానికి సహకరించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డికి, నీటిపారుదల శాఖ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డికి, జిల్లా మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావుకి వాకిటి  శ్రీహరికి  గద్వాల నియోజకవర్గ ప్రజలు తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు ఎల్‌నినో ప్రభావంతో వాతావరణ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో రైతులు సంప్రదాయ సాగు విధానాలకు బదులుగా పరిస్థితులకు అనుగుణంగా పంటల ఎంపిక చేసుకోవాలని సూచించారు.ప్రస్తుతం వర్షపాతం ఆశించిన స్థాయిలో లేకపోవడం,ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు తగ్గిపోవడంతో సాగునీటి లభ్యత పరిమితంగా ఉండే అవకాశం ఉందన్నారు.అందువల్ల అధిక నీటి అవసరమున్న వరి సాగును వీలైనంత మేర తగ్గించి,తక్కువ నీటితో సాగు చేయగల ఆరుతడి పంటలను సాగు చేయాలని రైతులకు సూచించారు.వరికి బదులుగా కంది,పెసర,మినుము, శనగ,జొన్న,సజ్జ,మొక్కజొన్న, వేరుశెనగ,నువ్వులు,వంటి ఆరుతడి పంటలను సాగు చేయాలని రైతులకు సూచించారు.ఈ పంటల సాగు ద్వారా తక్కువ పెట్టుబడితో మెరుగైన దిగుబడులు, గిట్టుబాటు ధరలు లభించి రైతులు అధిక ఆదాయం పొందే అవకాశం ఉంటుందని తెలిపారు. అలాగే రైతులు పండ్ల తోటలు, కూరగాయలు, ఇతర ఉద్యాన పంటల సాగుకు ప్రాధాన్యత ఇస్తే అదనపు ఆదాయం పొందవచ్చని తెలిపారు.ప్రభుత్వం ఉద్యాన పంటలకు అందిస్తున్న సబ్సిడీలు, ప్రోత్సాహక పథకాలను సద్వినియోగం చేసుకుని సాగు విస్తీర్ణాన్ని పెంచి లాభదాయక వ్యవసాయం వైపు అడుగులు వేయాలని రైతులకు సూచించారు.
శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారుల సూచనలను పాటించడం వల్ల పంట నష్టాలను తగ్గించుకోవచ్చు అని, ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొనేందుకు ప్రజల్లో అవగాహన పెంచాలి అని అన్నారు. అన్ని శాఖల అధికారులతో ఎల్ నినో ప్రభావం, తగు జాగ్రత్తల గురించి ఆదేశించారు.
నీటి వనరులను పొదుపుగా వినియోగించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు.
చెరువులు, కుంటలు, కాలువలను సంరక్షించి వర్షపు నీటిని నిల్వ చేసుకోవాలి అని అన్నారు. రైతులకు ప్రభుత్వం అందించే సలహాలు, పథకాలను సద్వినియోగం చేసుకొని పంటలు పండించాలి అని అన్నారు.
పశువులకు తాగునీరు, మేత కొరత రాకుండా మేత విత్తనాలను రైతులకు అందించే  ఏర్పాట్లు చేయాలి అని అన్నారు. గ్రామస్థాయిలో నీటి నిర్వహణపై ప్రత్యేక కార్యాచరణ చేపట్టి, ప్రతి గ్రామంలో మొక్కలు నాటడం ద్వారా పర్యావరణ సమతుల్యతను కాపాడిన వాళ్ళం అవుతామని ప్రతి ఒక్కరి చేత మొక్కలు నాటించాలి అని అన్నారు.
రైతులు కూడా వ్యవసాయ అధికారులకు సహకరించాలి అప్పుడే నీట్లు ఇబ్బంది లేకుండా ఉంటుందని పేర్కొన్నారు.
రైతులు సమన్వయంతో నీటిని వినియోగించుకోవాలి వృధా చేయకూడదని అన్నారు.ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు,  జిల్లా సీనియర్ నాయకులు,  నీటిపారుదల శాఖ అధికారులు, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333