రైతు, కార్మిక యువజన విద్యార్థి మహిళా సమస్యలపై సమరశీల పోరాటాల ను ఉదృతం చేద్దాం
ప్రజా ప్రత్యామ్నాయం నిర్మాణం చేద్దాం
యంసిపిఐ (యు) సూర్యాపేట జిల్లా జనరల్ బాడీ సమావేశం లో రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి పిలుపు
హైదరాబాద్, 19 ఆగస్టు 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- ది:-18-8-2026 రోజున మార్క్సిస్టు కమ్యూనిస్టు పార్టీ ఆప్ ఇండియా (ఐక్య) యంసిపిఐ (యు) సూర్య పేట జిల్లా జనరల్ బాడీ సమావేశం కామ్రేడ్ ఈరి వీరన్న అధ్యక్షతన సూర్యాపేట బాబు జగ్జీజీవన్ రాం భవన్ లో జరిగింది. తొలుత ఈ సమావేశం ఇటీవల అనారోగ్యంతో మరణించిన పార్టీ గ్రేటర్ హైదరాబాద్ జిల్లా కమిటీ సభ్యులు కామ్రేడ్ యం వై కుమార్ కి, వరంగల్ జిల్లా వరంగల్ డివిజన్ కమిటీ సభ్యులు కామ్రేడ్ మంద బాబుకి, అరుణోదయ నాగన్నకి, యుద్ద దాడుల్లో మరణించిన వారికి, ప్రకృతి వైపరీత్యాల వలన మరణించిన వారికి ప్రభుత్వ రైతాంగ వ్యతిరేక చర్యలతో ఆత్మహత్యలు చేసుకొన్న రైతాంగం కు సమావేశం 2 నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పార్టీ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ గాదగోని రవి మాట్లాడుతూ చాలా మంది కమ్యూనిస్టు లు లేరు వాళ్ళ పని ఐపోయింది అని విషం చిమ్ముతూ తమ దోపిడీ ని యదేచ్చగా కొనసాగించేందుకు వెంపర్లాడటం జరుగుతున్నది అని కానీ నేడు అంతర్జాతీయం గా, జాతీయంగా, రాష్ట్ర రాజకీయ పరిస్థితులు గమనిస్తే ప్రజలకు న్యాయం జరుగాలంటే కమ్యూనిస్టు లే ప్రత్యామ్నాయం తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు అని చరిత్ర ఋజువు లు చూపుతున్నాయి అని ఈ పరిణామాల్లో వివిధ కారణాల తో చీలి ఉన్న వామపక్ష కమ్యూనిస్టు పార్టీలు, సామాజిక శక్తులు ఐక్య ప్రత్యామ్నాయం ఏర్పాటు చేస్తే ప్రజలు ఆదరిస్తారని ఇందుకు కమ్యూనిస్టు పార్టీలు అన్ని చొరవ తీసుకుని బూర్జువా భూస్వామ్య దోపిడీ కార్పోరేట్ మతతత్వ, నియంతృత్వ శక్తులకు వ్యతిరేకంగా నికరమైన ఏ జెండా తో నిలబడాలని యంసిపిఐ(యు) చిత్తశుద్ధితో కృషి చేస్తున్నది అని అన్నారు. నేడు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న కార్పోరేట్ దోపిడీ సంపన్న అనుకూల ఆర్థిక విధానాలు ప్రజలు వ్యతిరేకంగా ఉద్యమాలు చేపట్టకుండా మతోన్మాద ఏ జెండా ను, లేదా పాకిస్తాన్, జమ్మూ కాశ్మీర్, బంగ్లాదేశ్, చైనా దేశాల సరిహద్దు సమస్యలను ఎజెండా చేసి దేశభక్తి ముసుగు రాజకీయాలు చేస్తున్నారని అని ఇవి అన్ని గమనించిన నిరుద్యోగ యువత, విద్యార్థి లోకం కేంద్ర పాలకులపై ఉద్యమం ప్రారంభించింది అని ఈ పోరాట స్ఫూర్తిని ప్రజలంతా స్వీకరించి ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ వరకుప్పల వెంకన్న మాట్లాడుతూ రానున్న కాలంలో ప్రజా సమస్యలపై ఉద్యమాలను ఉదృతం చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఎన్నికల వాగ్దానాలు అమలు చేయాలని ఆగష్టు 31 వ తేదీన జిల్లా కలెక్టర్ ఆపీసు ముందు ధర్నా చేసి మెమొరాండం రాష్ట్ర ముఖ్యమంత్రి కి ఇవ్వాలని పిలుపు నిచ్చారు. పార్టీ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ యస్ కే నజీర్ మాట్లాడుతూ ఈ మధ్య పార్టీ నిర్మాణం లో లేకుండా ఉన్న కామ్రేడ్సుతో సమన్వయం చేస్తూ సూర్యాపేట జిల్లా లో ప్రజా సమస్యలపై ప్రజా ఉద్యమాలు అభివృద్ధి చేయాలని కామ్రేడ్సు అంతా కలిసి పని చేయాలి అని పిలుపునిచ్చారు. ఈ జనరల్ బాడీ సమావేశం లో పార్టీ జిల్లా కమిటీ పునః నిర్మాణం చేయడం జరిగింది అని 19 మంది తో జిల్లా కమిటీ 8 మందితో జిల్లా కార్యదర్శి వర్గం ఎంపిక జరిగింది అని ఈ కమిటీ కార్యదర్శిగా కామ్రేడ్ యస్ కే నజీర్ ను సమావేశం ఏకగ్రీవంగా ఎన్నుకుంది అని ఎన్నికైన ఈ జిల్లా కమిటీ సభ్యుల రాజకీయ ఒక రోజు నిర్మాణం క్లాసు సెప్టెంబర్ 8 వ తేదీన అర్వపల్లి లో జరుగుతున్నది అని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఈదురి వీర పాపయ్య చందుపట్ల పవన్ కళ్యాణ్ నలుగురి రమేష్ లింగంపల్లి పంచాయతీ రాజ్ శ్రీరామోజు ఉమేష్ వేముల పెద్ద నరసయ్య మీసాల సైదులు నూక పొంగు వైభవ్ నసీరుద్దీన్ బాబా బొల్లె ఎల్లమ్మ తదితరులు పాల్గొన్నారు