రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి

08/02/2025.
చర్ల.
మిర్చి పంటలలో తెగుళ్ళు వచ్చి కనీసం పెట్టుబడి రాక నష్టపోతున్న రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి.
రైతుకు జరిగిన పంట నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వం వారికి అండగా నిలవాలి.
బహుజన్ సమాజ్ పార్టీ చర్ల మండల అధ్యక్షులు కొండా కౌశిక్ డిమాండ్.
చర్ల మండల పరిధిలోని రాళ్ల గూడెం గ్రామ సమీపంలో గల మిర్చి తోటలను శనివారం బహుజన్ సమాజ్ పార్టీ చర్ల మండల ఇన్ఛార్చ్ సామల ప్రవీణ్ సూచనల మేరకు మండల పార్టీ నాయకత్వం సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ మండల అధ్యక్షులు కొండ కౌశిక్ రైతాంగ సమస్యలను ఊదేశించి మాట్లాడుతూ మండల వ్యాపితంగా ఉన్న రైతాంగం మొత్తం ఆయా పంటల పై ఆరుగాలం కష్టం చేసి తిని తినక గంజి నీళ్లు తాగుతూ మండుటెండల్లో గొడ్డు చాకిరి చేస్తూ లక్షల రూపాయలను వడ్డీలకు అప్పులుతెచ్చి వారి ప్రాణాన్ని ప్రణంగా పెట్టి కుటుంబ సైతం ఆ పంటలు పండిస్తూ ఉంటారని ఆయన గుర్తుచేశారు. అలాంటి మిర్చి తోటలు ఇతరితర పంటలు రైతు కళ్ళముందే ఎర్ర తెగుళ్లు, ఆకు రాలుట, బొల్లి వైరస్లు, కాయలు సైతం రాలిపోయి నేల పాలు అవ్వుతుంటే ఆ రైతు పడే బాదా అంత ఇంత కాదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలో ఎక్కడ చూసినా మిర్చి తోటలో ఎర్ర తెగుళ్ళచోకి పంట చేతికి రాక తెచ్చిన అప్పులు తీర్చ లేక రైతులు భయబ్రాంతులకు గురౌతున్నారని ఆయన అన్నారు.ప్రతీ పంట మీద నష్టం జరిగిన రైతుని ఈ ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.తద్వారా రైతాంగాన్ని కాపాడుకోవాలని వారు కోరారు. స్థానికంగా ఉన్న సమందిత అధికారులు తక్షణమే స్పందించాలని నష్టపోయిన రైతుల్ని ఆయా పంట నష్టాన్ని అంచనా వేసి వారికి అండగా నిలవాలని ఆయన డిమాండ్ చేశారు.లేనియెడల నష్టపోయిన బాధిత రైతాంగాన్ని కాపాడుకునే దిశగా బహుజన్ సామాజ్ పార్టీ ఆధ్వర్యంలో రైతులందరిని పెద్ద ఎత్తున ఐక్యం చేసి ఉద్యమించడానికి సైతం వెనకాడబోయేది లేదని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతులు బి,కొండయ్య, రవణ,సందీప్, జి, పెంటయ్య, bsp పార్టీ చర్ల మండల కార్యదర్శి నక్కా, సాంబయ్య, తదితరులు పాల్గొన్నారు.