రైతులకు వ్యవసాయ శిక్షణ కార్యక్రమం
అడ్డగూడూరు 27 ఆగస్టు 2026 తెలంగాణవార్త రిపోర్టర్:- అడ్డగూడూరు మండల కేంద్రం రైతు వేదికలో వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ (ఏటీఎంఏ)లో భాగంగా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతు శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఇందులో భాగంగా రైతులకు సమీకృత వ్యవసాయం పైన కె.వి.కె గడ్డిపల్లి సీనియర్ శాస్త్రవేత్త ఏస్ నర్సింహా రెడ్డి(రిటైర్డ్)సాగులో మెళుకువలు పశు పోషణ గొర్ల పెంపకం కోళ్ల పెంపకం, కూరగాయల సాగు చేయాలనీ తెలిపారు.పంటల సాగులో సరైన విత్తనాల ఎంపిక, సమతుల్య ఎరువులు,పురుగు మందులు వాడకం,భూసార పరీక్షల అవశ్యకత అదే విదంగా రైతులు రసాయనిక ఎరువులు,పురుగు మందులు తగ్గించి సహజ సిద్ధంగా లభించే పశువుల పేడ చెట్ల పదార్దాలు వాడి ప్రకృతి వ్యవసాయం వైపు అడుగులు వేసి నేల సారాన్ని మరియు పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించాలని తెలియజేసారు.ఈ కార్యక్రమంలో మోత్కూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ లింగాల నర్సిరెడ్డి ఆలేరు ఏ.డి.ఏ కె నిర్మల,స్థానిక వ్యవసాయ అధికారి పి పాండురంగచారి,ఆత్మ మెంబెర్స్ డి స్వప్న, అడ్డగూడూరు గ్రామా వార్డ్ మెంబెర్స్ బైరెడ్డి సందీప్ రెడ్డి షైక్ సమీర్,వ్యవసాయ విస్తరణ అధికారులు ఏ అనూష,ఎస్ అక్షర,రైతులు తదితరులు పాల్గొన్నారు.