రైతన్నలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుంది

రైతన్నలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుంది
రేపటినుండి మూడు రోజుల పాటు రెవిన్యూ, అగ్రికల్చర్ అధికారులతో నుండి స్పెషల్ టీమ్ లను ఏర్పాటు చేసి నష్టం వాటిల్లిన పంట ను పరిశీలన చేసి నివేదిక ఏర్పాటు చేస్తాం ...
ములుగు తెలంగాణ వార్త : ములుగు జిల్లా అడిషనల్ కలెక్టర్ మహేందర్ జి రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి & స్త్రీ శిశు సంక్షేమ శాఖ మాత్యులు దనసరి అనసూయ సీతక్క ఆదేశాల మేరకు మంగపేట మండలం నరసింహసాగర్,మోట్ల గూడెం,మల్లూరు, గ్రామాలలో నిన్న కురిసిన భీకర వర్షo వల్ల నేలపాలు అయినా వరి పంట కొన్ని పదుల సంఖ్యల ఎకరాల్లాలో 80% ధాన్యం నీలాపాలు అవ్వడం వల్ల నోటిదాకా వచ్చిన పంట వరితో పాటు అన్ని పంటల నష్టాన్ని, పరిశీలించిన ములుగు జిల్లా అడిషనల్ కలెక్టర్ మహేందర్ తో పాటు తాసిల్దార్ గారూ, ఎంపీడీవో భద్ర నాయక్,ఎఓ చేరాలు, ఎంపీ ఓ మమతా తో కలిసి , పంట నష్టాన్ని పరిశీలన చేసిన మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, అదేవిధంగా రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు సీతక్క ద్రుష్టికి తీసుకెళ్లి ప్రభుత్వo నుండి నష్టపరిహారం వచ్చే విధంగా చొరవ చూపుతామని రైతన్నలకు హామీ ఇస్తూ రైతులు అధైర్యపడవద్దు ప్రభుత్వం రైతంగానికి పంట నష్ట పరిహారం తప్పకుండ అందిస్తుంది అని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా, నియోజకవర్గ, బ్లాక్ కాంగ్రెస్ నాయకులు, మండల సీనియర్ నాయకులు అన్ని అనుబంధ సంఘాల నాయకులు తదితరులు హాజరయ్యారు