రెండు నెలలు లోపు భార్యాభర్తలు అనారోగ్యంతో మృతి అనాధాలుగా మారిన చిన్నారులు

జోగులాంబ గద్వాల ఫిబ్రవరి 28 2025 తెలంగాణ వార్త ప్రతినిధి : మల్దకల్ అమ్మా, నాన్న లేక అనాధలుగా మారిన చిన్నారులు! మల్దకల్ మండలం చర్లగార్లపాడు గ్రామంలో అనారోగ్యంతో తల్లి, ఆర్థిక ఇబ్బందులతో తండ్రి మృతి చెందగా ముగ్గురు చిన్నారులు అనాథలయ్యారు. గ్రామస్థుల కథనం ప్రకారం.. కుమ్మరి వీరేశ్, భారతి కుండలు చేస్తూ జీవిస్తున్నారు. భారతి జనవరి 16న అనారోగ్యంతో మృతి చెందింది. భార్య లేని లోటు, ఆర్థిక ఇబ్బందులతో వీరేశ్ గురువారం ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లిదండ్రు మృతి చెందడంతో వారుకున్న ముగ్గురు చిన్నారులు అనాధలయ్యారు ఆ ముగ్గురు చిన్నారులను ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్థులు స్థానిక ప్రజా ప్రతినిధులను అఖిలపక్ష నాయకులను వేడుకుంటున్నారు...