రూ.250 కోట్ల స్కాం లో రైస్ మిల్లర్ ఓనర్ ఇమ్మడి సోమ నరసయ్య అరెస్ట్

May 27, 2024 - 20:06
May 27, 2024 - 21:08
 0  14
రూ.250 కోట్ల స్కాం లో రైస్ మిల్లర్ ఓనర్ ఇమ్మడి సోమ నరసయ్య అరెస్ట్

తిరుమలగిరి 28 మే 2024 తెలంగాణవార్త రిపోర్టర్ సూర్యాపేట జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఇమ్మడి సోమనర్సయ్య ను అరెస్ట్ చేసినట్లు సూర్యాపేట డిఎస్పీ తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు… సి.ఎం.ఆర్ బియ్యం ను ప్రభుత్వానికి అప్పగించకుండా కోట్లు విలువైన ధాన్యాన్ని పక్కదారి పట్టించారని తిరుమలగిరి పోలీసు స్టేషన్ లో పౌర సరఫరా శాఖ అధికారులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.ఈ ఫిర్యాదు మేరకు ఇమ్మడి సోమనర్సయ్య కు చెందిన మూడు మిల్లులలో అధికారులు తనిఖీలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ తనిఖీల్లో సుమారు రూ.250 కోట్ల విలువైన ధాన్యం మాయమైనట్టు నెల క్రితం అధికారులు గుర్తించారు. ఇందులో భాగంగానే ఆదివారం రాత్రి ఇమ్మడి సోమయ్యను అరెస్ట్ చేసి జుడీషియల్ రిమాండ్ కు తరలించినట్టు సూర్యాపేట డిఎస్పీ తెలియజేశారు.

Jeripothula ramkumar Thungaturti constant and Tirumalagiri Mandal Reporter (RC) Suryapet District Telangana State JRK 7674007034