రూ.11 లక్షలకు పైగా మున్సిపల్ సొమ్ము దుర్వినియోగం
జోగులాంబ గద్వాల 25 సెప్టెంబర్ 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి : గద్వాల: మున్సిపాలిటీలో అద్దె వసూళ్ల బాధ్యతలు నిర్వహిస్తున్న ఓ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి రూ.11 లక్షలకు పైగా మున్సిపాలిటీకి చెందిన అద్దె సొమ్మును దుర్వినియోగం చేసినట్లు ప్రాథమిక విచారణలో గుర్తించినట్లు కమిషనర్ జానకీరామ్ సాగర్ తెలిపారు. ఈ వ్యవహారంపై గద్వాల పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు.
ఉన్నతాధికారులకు పూర్తి నివేదిక అందజేశామని, ప్రస్తుతం పూర్తి స్థాయిలో విచారణ కొనసాగుతోందని తెలిపారు. మున్సిపాలిటీకి సంబంధించిన ఆర్థిక లావాదేవీలను కూడా పరిశీలిస్తున్నామని, విచారణ పూర్తయిన అనంతరం పూర్తి వివరాలను వెల్లడిస్తామని కమిషనర్ పేర్కొన్నారు.