రియల్ ఎస్టేట్ ముసుగులో ఘరానా మోసం... విలేకరిగా చలామణి

రియల్ ఎస్టేట్ వ్యాపారి ఎల్లయ్య,విలేఖరి రాజు,పై కేసు నమోదు...
పెబ్బేరు ఎస్ఐ హరిప్రసాద్ రెడ్డి
అక్రమాలకు పాల్పడుతూ అమాయకుల నుంచి లక్షల రూపాయల దోచుకుంటున్న రియల్ ఎస్టేట్ వ్యాపారి గోనేల ఎల్లయ్య మరియు విలేకరిగా పనిచేస్తున్న బొడ్డుపల్లి రాజు(విలేఖరి) అను వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు పెబ్బేరు ఎస్ఐ హరిప్రసాద్ రెడ్డి తెలిపారు.పెబ్బేరు పట్టణంలోని సర్వేనెంబర్ 369లో తమకు సంబంధం లేని పలు ప్లాట్లపై తప్పుడు డాక్యుమెంట్స్ సృష్టించి పలువురికి విక్రయించి మోసం చేసిన వ్యక్తులపై గద్వాల జిల్లా ప్రాంతానికి చెందిన ఆర్యవైశ్య కులానికి చెందిన కళ్యాణ్ కుమార్ తండ్రి నాగిశెట్టి ఫిర్యాదు చేయడంతో పెబ్బేరు ఎస్ఐ హరిప్రసాద్ రెడ్డి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసినట్లు విచారణ జరిపినట్లు తెలిపారు.ముఖ్యంగా భూములు,ప్లాట్లు కొనుగోలు చేసే ముందు సంబంధిత పత్రాలు సక్రమంగా వున్నది లేనిది క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిశీలించుకోవాలని సూచించారు.ఇటీవల రియల్ ఎస్టేట్ వ్యాపారులు/భూమి యాజమానులు ప్లాట్ల అభివృద్ధి పేరుతో ఫైనాన్సర్ల నుండి డబ్బు తీసుకొని ఫైనాన్సర్లకు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. అదే ప్లాట్లను మరొకరికి జీపీఏ చేసి డబ్బులు తీసుకుని రిజిస్ట్రేషన్ చేయకుండా మోసం చేస్తున్నట్లు పలు ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు.పెబ్బేరు పట్టణంలోని మరియు ఇతర గ్రామాల్లో ఎవరైనా బాధితులు ఉన్న ఫిర్యాదు చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఎస్ఐ హరిప్రసాద్ రెడ్డి తెలిపారు