రాష్ట్ర చైతన్య సభ పోస్టర్ ఆవిష్కరించిన షాబీర్ పాష

చేయి చేయి కలుపుదాం దళిత జర్నలిస్టులం ఏకమైదం 

Sep 20, 2024 - 18:18
Sep 20, 2024 - 18:18
 0  1
రాష్ట్ర చైతన్య సభ పోస్టర్ ఆవిష్కరించిన షాబీర్ పాష

దళిత జర్నలిస్టు ఫోరం రాష్ట్ర రాష్ట్ర ఉపాధ్యక్షులు రత్నకుమార్ ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరణ

కొత్తగూడెం సెప్టెంబర్ 20 (  ):తెలంగాణ రాష్ట్రంలో దళిత జర్నలిస్టు ఫోరం రాష్ట్ర చైతన్య సభ సెప్టెంబర్ 27 శుక్రవారం రవీంద్ర భారతిలో నిర్వహించడం జరుగుతుందని ఈ సందర్భంగా దళిత జర్నలిస్టు ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షులు రత్నకుమార్ ఆధ్వర్యంలో రాష్ట్ర చైతన్య సభ పోస్టర్ ఆవిష్కరణ చేసిన సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి షాబీర్ పాషా.ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు రత్నకుమార్ మాట్లాడుతూ దళిత జర్నలిస్టులకు ప్రతి ఒక్కరి కి అక్రిడేషన్ సౌకర్యం కల్పించాలని దళిత జర్నలిస్టులకు అభయస్థం పథకం కింద 12 లక్షలు ఇవ్వాలని ప్రతి జిల్లాకు అక్రిడేషన్ కమిటీలో స్థానం కల్పించాలని పత్రిక నిర్వహిస్తున్న జర్నలిస్టులకు ప్రభుత్వ ప్రకటనలు ఇవ్వాలని ప్రతి దళిత జర్నలిస్టులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని సీనియర్ దళిత జర్నలిస్టులకు నామినేషన్ పదవులు కేటాయించాలని దళిత జర్నలిస్టులు అకాల మరణం చెందితే పది లక్షల ఎక్స్గ్రేషన్ కల్పించాలని ప్రతి దళిత జర్నలిస్టులపై ఎలాంటి దాడులు జరగకుండా రక్షణ కల్పించాలని దళిత జర్నలిస్టులకు నిరుద్యోగ భృతి 5000 రూపాయలు ఇవ్వాలని కోరుతూ దళిత జర్నలిస్టు ఫోరం ఆధ్వర్యంలో రాష్ట్ర చైతన్య సభ రవీంద్ర భారతిలో సెప్టెంబర్ 27వ తారీకు శుక్రవారం రోజు నిర్వహించడం జరుగుతుందని మన హక్కులను సాధించుట కొరకు  ప్రతి ఒక్క దళిత జర్నలిస్టు వేలాదిగా తరలి రావాలని  ఈ చైతన్య సభకు హాజరై విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నా జర్నలిస్టు ఫోరం రాష్ట్ర  ఉపాధ్యక్షులు రత్నకుమార్  తెలియజేసినారు. ఈ సందర్భంగా పోస్టర్ ఆవిష్కరించిన సిపిఐ జిల్లా కార్యదర్శి షాబీర్ పాషకు కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో దళిత జర్నలిస్టు ఫోరం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు బాలకృష్ణ జనరల్ సెక్రటరీ వినోద్ బాబు గౌరవ అధ్యక్షులు కూరపాటి  రవీందర్ చుంచుపల్లి మండల అధ్యక్షులు శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333